భాషతోనే బతుకు!;డా. పివిఎల్ సుబ్బారావు,-విజయనగరం- 94410 58797.

జనవాణికి, జే ,కొడదాం, ఘనవాణిని రక్షిద్దాం !(వాడుక భాష ప్రాధాన్యతపై,కవిత్వం!)
==============================================================
1. ప్రజలకొరకు,
            ప్రజల వలన,
                     ప్రజల చేత!

   విస్తరించే జనవాణి,
                  జనజీవనబాణి!

"భావవినిమయం",
           భాష సరిపాత్ర ధారిణి!

వక్త భావం,
      శ్రోత హృదయం చేరాలి!

 భాష కారాదు అవరోధం,    
        చేయాలి అనుసంధానం! 

మాట్లాడే భాషలోనే ,
                రచనలు జరగాలి!

 పదాల అర్ధాలు,
 వెతుక్కునే అనర్ధం పోవాలి! *
  
దేశమును ,
             ప్రేమించుమన్నా,
మంచి అన్నది ,
.                పెంచుమన్నా !

గిడుగు, గురజాడల ,
బాటలో ముందుకు పోవాలి!

2. అర్థం కాని భాషల రచనలు,
         రచయితల సమాధులు!

  అర్థమైతే అవి ,
జన చైతన్య,సౌధ పునాదులు !
 
ఎంకి పాటలు ,
ప్రేమకి విరసిన పూల తోటలు! 

వేమన ఆట వెలదులు,
           కవితానంద జలధులు! 

జనవాణికి నీరాజనం పట్టు,
 ఆ ఘనవాణికి పట్టంకట్టు! 

జానపదాలే ,
జ్ఞాన పథాలకి ,దారి చూపెట్టు! 

భాష వినాలి, అనాలి, చదవాలి, భాషలో వ్రాయాలి!
 
ఈ భాషా నైపుణ్యాలు,    
       సరిజీవన నైపుణ్యాలు !

విశ్వాన విహరించే,
 మానవ విహంగ వీక్షణాలు!
_________

కామెంట్‌లు