శిక్షకుల గుర్తింపు! శిక్షణలో రాణింపు!;- డా.పి.వి.ఎల్. సుబ్బారావు ,-94410 58797.
పంచపది,
-----------
నా పంచపదుల సంఖ్య---

1020.
"క్రీడ" ప్రతిభ మూలం, శిక్షణ, అభ్యాసం, లక్ష్యకామన !

గురువు బోధన ,శిష్యుని శోధన, విజయ సాధన!

 అర్జునుడు విలువిద్య, విజయుడు, ,ద్రోణుని తపన!

ఇన్ని కోట్ల జనాభా,
 క్రీడాకారులు ఎందరు అనిన!  

క్రీడా ప్రోత్సాహ మేలైన సూచిక, ద్రోణాచార్య ఎంపిక, పివిఎల్!

1021.
క్రీడాకారుని విజయం, శిక్షకుడితోనే సదా సాధ్యము!

అత్యుత్తమ శిక్షకుడికి, ద్రోణాచార్య పురస్కారము!

 శిక్షకుడి ఇరవైఏళ్ళ, 
   శ్రేష్ట కృషి గుర్తించడము!

ద్రోణాచార్య కాంస్య విగ్రహం,
 ఓ ధ్రువీకరణ పత్రము!

దుస్తులు, 
    పదిహేను లక్షల నగదు,
       బహూకరణం, పివిఎల్!

1022.
ఒలింపిక్, ఆసియా ,
వంటి క్రీడలకు పరిమితము!

 దశ సభ్య కమిటీ,
 నామినేషన్ల పరిశీలనము!

 క్రీడామంత్రిత్వ శాఖకు,
ఆమోదం కోసం సమర్పితము!

 ఎనభైఐదు, ప్రారంభం,
 బహు ద్రోణుల, ఆవిర్భావము! 

"ఆ

ద్రోణుడు, ఓ పార్థుడు",
నేడు పార్ధులెందరో వస్తారు, పివిఎల్!
_________

కామెంట్‌లు