తెలుగు భాష ,సంస్కరణారామదీప్తి!;- డా. పి వి ఎల్ సుబ్బారావు, 94410 58797.
పంచపది ,
-------------
నా పంచ పదుల సంఖ్య--

1023.
వెంకమ్మ వీర్రాజు దంపతుల, మేలైన సంతాన స్ఫూర్తి !

తెలుగు భాషకి శక్తి ,
గిడుగు వెంకట రామమూర్తి! 

జయంతి ,
"తెనుగు భాషా దినోత్సవం", ఎనలేని కీర్తి !

వాడుక భాష, ఉద్యమ, పితామహుడు ,దిగంత దీప్తి!

 నిత్య వ్యవహార భాష అందం, 
 చూపిన అద్భుత వ్యక్తి,
 పి వి ఎల్!
టూ
1024.
గ్రాంధిక భాష వచనం,
 వాడుక భాష వైపు అడుగు! 

వాడుక భాష ఉద్యమాన,  
    ఆయన చిచ్చర పిడుగు!
 
జీవితమంతా భాషా రక్షణ,   
    పట్టినాడు ఓ గొడుగు !

ఆయన వలనే చదువు,   
 అందరూ మునిగే మడుగు! 

భాషావేత్త, హేతువాది, చిత్తశుద్ధితో ఆశయసిద్ధి, పివిఎల్!

1025.
అడవుల సవరల,
 చదువు చెప్పాలని ఆకాంక్ష! 

అలుపెరుగని శ్రమతో చేపట్టిన, అద్భుత దీక్ష !

సవర భాషలో పుస్తకాలు, వ్రాసిన అతడో దక్ష !

సొంత సొమ్ముతో వారి చదువు, ఏర్పాట్లు, ఏమా  ఆపేక్ష! 

అనన్య కృషి ,
 సవర వ్యాకరణ ,నిఘంటు,
            రచన పి వి ఎల్!
1026.
బ్రిటిష్ ప్రభుత్వం,
         రావు సాహెబ్,   
             బిరుదుప్రదానము !

సేవలకు
  కైసర్-ఇ-హింద్ మెడల్,
                   పురస్కారము !

ఆం. విశ్వ కళాపరిషత్ ,
కళాప్రపూర్ణ సత్కారము! 

గిడుగు సేవలపై పరిశోధన,   
             యశోకారణము!
 
గిడుగు "స్మరణ" తెలుగు, అనుసరణ  ఓ వెలుగు,
 పివిఎల్!

1027.
విశ్వనాథ మాట,
" తెలుగు సరస్వతి,
                నోముల  పంట !'
"మన ,
బిరుదులన్నీ సమర్పించాలి ",
                 చెళ్ళపిళ్ళ మాట!

 "పాలమీగడ గిడుగు "
పులిదండి వారి కితాబట!
 
భాషావేత్తలు ,వారి కృషి పై,
       రచనలు చేసారట !

సుప్రసిద్ధులు, పరిశోధన,
 పి.హెచ్.డి.స్వీకరణ, పివిఎల్!
_________


కామెంట్‌లు