ఏదైనా పుస్తకం చదవాలి అనుకున్నప్పుడు ముందు అక్షరాలు నేర్చుకోవాలి తర్వాత పదాలు చివరిగా వాక్య నిర్మాణం తెలిస్తే తప్ప పుస్తకం చదవడానికి అవకాశం లేదు అలాగే మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను నిత్యం కొనసాగించాలన్న అభిప్రాయంతో చేయడానికి సంకల్పించిన దాని పద్ధతులు తెలియకుండా అవి ఏమిటో ఎలా వచ్చాయో దాని వల్ల ప్రయోజనం ఏమిటో తెలియకుండా చేయడం అంటే ఎందుకు పనికిరానిది అవుతుంది ఆచారాన్ని గురించి తెలియాలి అంటే వీడెవడో మడిగట్టు కూర్చున్నాడే అంటారు. మీరు దడిగడుతున్నాడు కదా ఎందుకు అని అడిగితే మదుగు కోసం ఇతరులు చూడకుండా ఉండడం కోసం అని సమాధానం వస్తుంది మడి కూడా అందుకే కదా రోగకారక క్రిములు నుంచి రక్షణ కోసం అలా చేస్తాడు అన్న విషయం తెలియకపోతే దానిని ఎలా ఆచరిస్తాడు.
ఒక పిసినారిని మనం పరిశీలించినట్లయితే అతనికి ధన దాహం తప్ప మరొకటి లేదు కానికి కూడా కక్కుర్తి పడేవాడు ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళేవాడు ఎంత సంపాదించాలి అన్న అభిప్రాయం అతనికి ఉన్నది జీవితంలో ఎంత సంపాదించగలిగితే అంత సంపాదించుకోవాలని కోరిక మాత్రం ఉంటుంది ఈ డబ్బులు నుంచి కనీసం ఒక రూపాయి అయినా తాను వాడుకోవడానికి ఉపయోగిస్తున్నాడా అంటే అది లేదు కుటుంబం కోసం ఖర్చు చేస్తున్నాడా ఆదాఖలాలు లేవు తాను తినడానికి కాకుండా కుటుంబం ఆనందంగా గడపాలన అభిప్రాయం కూడా లేకుండా ఈ డబ్బు సంపాదించడం దేనికి దీని వల్ల ఫలితం ఉంటుందా లేని దానికోసం తాపత్రయం లేనిది అంటాడు వేమన. కొంతమంది వ్యక్తులను మనం గమనిస్తూ ఉంటాం తనకు మంచి జరగకపోయినా పర్వాలేదు ఎదుటివాడికి మంచి జరగకూడదు ఒక రైతు పొలంలో పంట పండించి ఆదాయాన్ని పొందుతాడు తనకన్నా ఎక్కువ పండించిన వాడిని గురించి ఆలోచించి బాధపడవలసిన అవసరం ఉంటుందా ఎదుటివారికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు వీరికి చాలా ఆనందంగా ఉంటుంది ఏదైనా మంచి జరిగి లాభసాటి వ్యవహారం ఏదైనా ఆ కుటుంబానికి జరిగినట్లయితే ఆ రోజంతా ఏడుపు తప్ప మరొకటి లేదు అలాంటి ఓర్వలేనితనం ఉండడం వల్ల అతనికి ఏమైనా ప్రయోజనం ఉన్నదా లేని దానిని గురించి ఎందుకు తాపత్రయపడడం అంటాడు వేమన వారు రాసిన ఆ పద్యాన్ని చదవండి మీకు తెలుస్తుంది.
"అక్షరం బెరుగని యాచార మది యేల తాను దినని యట్టి ధనమదేల నొరుల మేలు చూచి యోర్వని తనువేల..."
ప్రాథమికం తెలియకపోతే;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి