మానవుని మనసు చాలా ప్రత్యేకత కలిగి ఉన్నది అది ఆలోచించినట్లుగా ప్రపంచంలో ఉన్న ఏ యంత్రము ఆలోచించలేదు క్షణక్షణానికి మారిపోతూ ఉండే దాని తత్వం తెలుసుకోవడం కూడా కాదు కారణం ఏ క్షణాన ఆ మనసు ఎటు వెళుతుందో దానికే తెలియని పరిస్థితి మరి ఈ శరీరం దానిని నడిపించే జీవి చెప్పిన పద్ధతిలో వెళుతుందా లేక మనసు చెప్పే మాటలపై మమకారం పెంచుకుంటున్నదా అసలు మూలానికి వెళితే మనసే ప్రధానం. కుండలినిలో ప్రారంభమైన ఆలోచన మనసైన వెన్నుపూస ఒక్కొక్క పూసను దాటి చిన్న మెదడుకు వెళ్లి ఆ తరువాత భృకుటి దాటి బుద్ధికి వెళుతుంది అక్కడ ఈ మనసు చెప్పిన పనిని అది చేస్తుంది. బజారుకు వెళ్ళినప్పుడు దోవలో తీపి పదార్థాలు అనే అంగడి కనిపించినప్పుడు మనసు అటు లాగక తప్పదు వెళ్లి చూసిన తర్వాత అనేక పదార్థాలు ఉన్నాయి ఒక పదార్థాన్ని నాలుగైదు రకాలుగా చేసి ఉన్నాయి అతనికి జిలేబి ఇష్టం అని అనుకుంటే బెల్లంతో చేసినా పంచదారతో చేసినా జిలేబి కనిపిస్తుంది ముదురుపాకంతో చేసింది ఒక ప్రక్కన లేత పాకంతో చేసినది మరొక ప్రక్కన పెట్టి వెళ్లిన వారికి ప్రలోభం కలిగించేలా వ్యాపారం చేస్తారు వాళ్ళు దేని మీద మనసు పడుతుంది అన్నీ తినాలనిపిస్తుంది కానీ తనకు వాటిలో నచ్చినది మాత్రమే తీసుకుంటారు అలాగే మరొక పదార్థం మరొక పదార్థం పళ్ళు అమ్మే బండి కనిపించగానే రకరకాల పళ్ళ మీద మనసు పడుతుంది అన్నీ కొనగలడా చూస్తూ ఆనందిస్తాడు అంతవరకే. మరి కొంచెం దూరం వెళ్లేసరికి ఒక అందమైన అమ్మాయి నాజూకుగా నడుచుకుంటూ వెళుతున్న సందర్భం కలిసి వస్తే ఆమెను చూడగానే లొట్టలు వేసుకుంటూ సొంగ కార్చుకుంటూ ఆమెతో పొందు కావాలన్న కోరిక బలంగా పెరుగుతుంది దానికి తగిన ఏర్పాటు చేసుకొని తన అందం కానీ తన రూపం కానీ తనధనం కానీ ఆశ చూపి ఆమెను వలలో వేయడానికి ప్రయత్నం చేసి సఫలీకృతులు అవుతాడు దానివల్ల అతడి జీవితం నాశనం కావడం ఖాయం దానిని తప్పించుకోవడం అతని వల్ల కాదు అని చెబుతున్నాడు వేమన. అది వారి అనుభవం కూడా కావచ్చు ఆ మనస్తత్వ విశ్లేషణ తో చేసిన ఆపద్యాన్ని ఒకసారి చదవండి మనకు ఏమైనా ఆలోచనలు వస్తే వాటిని దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు కదా.
"మంచి రుచుల గోరు మంచి స్త్రీలను గోరు మనుజుదెంత చెడ్డ మనసు జూడ యించు కంతయైన నేలని విడువడు..."
"మంచి రుచుల గోరు మంచి స్త్రీలను గోరు మనుజుదెంత చెడ్డ మనసు జూడ యించు కంతయైన నేలని విడువడు..."
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి