జీవితంలో అన్ని సుఖాలను అనుభవించి కష్ట సుఖాలన్నీ తెలిసి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న కోరికలను తీర్చుకున్న తరువాత ఆధ్యాత్మిక చింతనకు వెళితే ఎలా ఉంటుంది అనే ఆలోచన వస్తుంది అప్పుడు భార్య పిల్లలు సంసారం మొత్తం వదిలేసి కట్టు బట్టలు కూడా తీసి ఏదో గోచి లాంటిది పెట్టి ఇంటిలో కానీ గ్రామంలో కానీ కాదు ఎక్కడైనా ఏకాంత ప్రదేశంలో ఉండి మనం మోక్ష సాధన చేస్తే తప్ప మనకు ముక్తి రాదు అన్న అభిప్రాయంతో దూర ప్రాంతానికి వెళ్లి ఏ అడవిలోనోలేదా కొండల మధ్యలో ఉండి తపస్సు అన్న బ్రాంతికి వెళ్లి అక్కడ కాలాన్ని దుర్వినియోగం చేయడం తప్ప అతనికి నిజమైన మోక్షం పై దృష్టి ఉన్నదా ఉంటే దానిని గురించి పరిశీలించాడా అన్నది ప్రశ్న. అత్రి మహర్షిని మించిన మహర్షి మరొకరు మనకు కనిపించరు వారి భార్య అనసూయ ఆమెతో కలిసి పర్ణ కుటీరంలో ఉండి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీరి ఇంటికి వస్తే భోజనానికి వారి కోరిక ప్రకారం వారిని చంటి పిల్లలను చేసి భోజనం పెట్టింది మహాసాద్వి కనుక మరి ఈ మహర్షి సంసారానికి దూరంగా ఉన్నాడా అంటే కామానికి దూరంగా ఉన్నాడు తప్ప సంసారానికి కాదు అని పెద్దలు చెబుతారు అలాగే జమదగ్ని అలాంటి మహర్షులు చాలా అరుదుగా ఉంటారు వారికి భార్య కుమారుడు లేరా పరశురాముడు ఎవరి కుమారుడు వారి కుమారుడు కాదా వారు ఏ ఏకాంతాన్ని ఆశ్రయించి గోచి కోసం తపన పడలేదే తన మనసును నిశ్చలంగా ఉంచుకుంటే చాలు అని మనకు తెలియజేశారు.
మరి అలాంటి మహర్షులు తత్వాన్ని గురించి ఆలోచించలేదా తత్వం అంటే వారికి అర్థం తెలియదా వారి పేర్లు కూడా వినని ఇలాంటి అజ్ఞానులు యోగం అంటే ఏమిటో తెలియకుండా తపస్సు అనే మాట వినకుండా ఏదో ఏకాంతంగా అడవులలో కందమూలాలు తింటూ కావలసిన పండ్లను తిని కడుపు నింపుకోవడం కోసమో అక్కడికి వెళ్లి కాలక్షేపం చేస్తే తత్వం ఏదైతే ఉన్నదో అది నేనే అన్న విషయం ఎన్ని జన్మలు ఎత్తితే అతనికి అర్థం అవుతుంది కనుక అలాంటి పనికిమాలిన పనులు చేయకండి దానివల్ల చులకన అవుతారు తప్ప ఫలితం ఉండదు అని చెప్తున్నాడు వేమన ఆ విషయాన్ని గురించి ఆటవెలదిలో వేమన రాసిన పద్యం చదవండి.
"ఇల్లు నాలు విడిచి ఇనుప కచ్చర గట్టి వంటకంబు నీరు వాంఛలుడిగి వంటి నున్న యంత వచ్చునా తత్వంబు..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి