జ్ఞాన ముద్ర ;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 అక్షర సముదాయమును నేర్పే  తల్లి శిక్షణలో బిడ్డ పెరుగుతూ  ఒక్కొక్క తరగతిలో మంచి మార్కులతో వృద్ధి చెందుతున్న వ్యక్తి  అనేక రకాలైన  సాంఘిక ఆర్థిక  చారిత్రిక విషయాలతో పాటు  అసలు జ్ఞానం అంటే ఏమిటి అని తెలుసుకోవడం ఎలా  అన్న ఆలోచనకు వచ్చి  తనకు తెలిసే పద్ధతిలో  చెప్పగలిగిన గురువుగారిని వెతికి  తనలో ఉన్న అజ్ఞానాన్ని మొత్తం  పటాపంచలు చేసి  విజ్ఞానాన్ని కలగజేసే వ్యక్తి వల్ల  తన జీవితం ఎన్నో మార్పులు చెందుతూ ముందుకు వెళుతుంది  ఎప్పుడు జ్ఞానం తనకు కలిగిందో  అలాంటి జ్ఞానిలో తనకు తెలియకుండానే అద్భుతమైన తేజస్సు అతనిలో ప్రవేశిస్తుంది  ఆ తేజస్సే జ్ఞానం అని మన మునులు చెబుతూ ఉంటారు.
అలాంటి తేజస్సు తనలో ఎప్పుడు ప్రవేశించిందో  ఆ క్షణం తన జీవిత విధానం మారిపోతుంది  నూతన విశేషాలను తెలియజేసుకోవాలన్న కాంక్ష  ఏ వ్యక్తి లోనైనా ముందు ఆలోచన వస్తుంది  ఆ వచ్చిన దానిని తెలుసుకోవాలన్న ఆతృతతో  ఎన్నో ప్రయత్నాలు చేసి తన సాధన తో  సాధించడానికి ప్రయత్నం  చేస్తాడు  మానవుడు కృషి ఉంటే చేయలేనిది ఏదీ లేదని మన పెద్దలు చెప్పిన మాట  తన సాధన వల్ల తాను ఏది అనుకున్నాడో దానిని తప్పకుండా సాధిస్తాడు. ఆ సాధన చేయడమే మంచి మార్గం అని  అనేకమంది మునుల అభిప్రాయం  మనకు కావలసినది ఇతరులు ఎవరో చేసి పెట్టడం  జరగని పని  నీ కృషి వల్లనే అది సాధ్యం చూడడం వల్ల నీకు తృప్తి  కలుగుతుందా ఆ సంతోషంలో  తరువాతి కార్యక్రమానికి  నాంది పలకవచ్చు. ఆ సమయంలోనే నేను అంటే ఏమిటి ఈ మానవ ఆకృతిలో కనిపించే శరీరమా  లేక ఈ శరీరాన్ని నడిపించే ఆత్మా  ఏది ముఖ్యం  అన్న విషయాలను తర్జన భర్జన చేసి  సరి అయిన మార్గం ఏదో తెలుసుకుని  దాని ద్వారా ప్రయాణం చేసి  ఆ నేను అన్న శబ్దం  బ్రహ్మమే అన్న విషయం  స్పష్టంగా తెలుసుకుంటాడో  ఎప్పుడైతే అహం బ్రహ్మాస్మి అని తెలిసిందో  కావున అప్పుడు సంపాదించిన జ్ఞానం  పరిపూర్ణమైనటువంటి  బ్రహ్మ జ్ఞానం. దాని ద్వారా సాధించితేనే పరమార్థం ఉంటుందని  అనేకమంది ఋషి  పుంగవులు మనకు తెలియజేశారు  పెద్దలు చెప్పిన  ప్రతి మాట మనం  స్వీకరించి ఆచరించినట్లయితే  మన జీవన మార్గం  సుఖమయం అవుతుంది  మోక్ష ప్రాప్తి కలుగుతుంది అంటాడు ఆ పద్యాన్ని చదవండి.
"జ్ఞానముద్ర చేతగా నవచ్చెను తళుకు యరిది మదిని శ్రేష్టమనుచు మునులు పలికి రదియ తెలియ పరమార్ధమగునయా..."
 

కామెంట్‌లు