కూర లేని కూడు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 జీవితంలో ఎవరైనా  పంచభ క్ష్య పరమాన్నాలతో భోజనం చేయాలని  షడ్రుచులతో  భోజనం ఉండాలని ఆశపడతారు  అందరికీ అది సాధ్యమవుతుందా  ఆర్థిక స్తోమత లేని వారు ఎలాంటి భోజనానికి  అలవాటు పడతారు ఒకసారి మనం చూస్తే ఆశ్చర్యపోతాం  భోజనాన్ని గురించి రాయలవారి కాలంలో  భోజనం దేహి రాజేంద్ర ఘ్రుత సూప సమన్వితం  అన్న పద్యం గుర్తొస్తుంది  నాకు పప్పుతో కూడిన నేతితో  భోజనం పెట్టండి అని మహారాజుని అర్ధించే  బ్రాహ్మణుని చరిత్ర  ఇంటిలో భోజనం చేసినప్పుడు  నెయ్యి లేకపోతే ఎలా ఉంటుంది  జంతువులు గడ్డి మేస్తే ఎలా ఉంటుందో  మానవుడు తీసుకుంటున్న నెయ్యి లేని అన్నం అలా ఉంటుంది  అని వేమన వర్ణిస్తున్నాడు.
ఏ ఇంటిలోనైనా గృహిణి  భోజనం వడ్డించినప్పుడు  కూర లేకుండా పెట్టదు  ఎంత బీదవాడు అయినా  కూర లేని కూడు  తినలేడు  కూరలేని కూటిని వేమన ఎలా వర్ణిస్తున్నాడంటే  వంట గదిలో దొంగతనంగా  ప్రవేశించిన కుక్క  అన్నం ఉన్న పాత్రను చూస్తే ఏం చేస్తుంది  ఎన్నో రోజులు ఆకలితో అలమటిస్తున్న  పద్ధతిలో ఆ కుక్క వట్టి అన్నాన్ని మాత్రమే తింటుంది. దానికి కూరలు వేసుకోవాలని  నెయ్యి లేకపోతే ముద్ద దిగదని  ఆలోచన ఉండదు  ఆమిష శూన్యమై వసాగంధిలమైన శల్యము దొరికిన మాత్రాన వేపి మిక్కిలి సంతోషించునని  విష్ణు శర్మ గారు చెప్పిన  చిన్నయ్య సూరి అనువదించిన విషయం దానిని ఎవరు కాదనలేరు  అలాంటి కుక్క తిండిలా ఉంటుంది కూరలేని భోజనం మానవునికి  అని తెలియజేస్తున్నాడు  వేమన.
ఏ ఇంటిలోనైనా  ఆ ఇంటి ఇల్లాలు  ఎవరైనా భోజనానికి వచ్చినప్పుడు  ఆప్యాయంగా అన్నం పెడుతుంది  కుటుంబ మర్యాదను కాపాడవలసిన గృహిణి  తన పద్ధతి ప్రకారం  అతిథి వచ్చినా అభ్యాగతి వచ్చినా  వారికి తృప్తిగా భోజనం పెట్టడం కోసం  ఆప్యాయంగా అతను ఏ పదార్థం  తయారు చేస్తే దానిని వడ్డించే పద్ధతి ప్రకారం  చేస్తుంది  అలా కాకుండా ఆప్యాయతలోపిస్తే ఆ భోజనం ఎలా ఉంటుంది తినేవాడికి  ఏదో  వడ్డించాలి కనుక  అలా చేస్తుంది  అనిపించక మానదు  అలాంటి దానిని పిండాకూడుతో పోల్చి చెబుతున్నాడు వేమన  తద్దినపు భోజనాలన్నీ  దాదాపు ఇష్టం లేకుండానే జరుగుతాయి అని వేమన అభిప్రాయం  భోజన పద్ధతుల వివరణ  ఈ పద్యంలో ఎంతో అందంగా చెప్పారు ఆ పద్యాన్ని చదవండి.

"నెయ్యి లేని కూడు నీయాన  కలువది కూరలేని తిండి కుక్క తిండి  ప్రియములేని కూడు   పిండపు కూడురా..."


కామెంట్‌లు