మన్మథ లీల;- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 మానవుడు రాతియుగం నుంచి  అభ్యుదయ భావాలు కల సమాజంలోకి అడుగు పెట్టిన తర్వాత  అనేక రకాలైన మార్పులు  మనం చూస్తున్నాం  మతాల వారి  వ్యక్తుల ప్రవర్తన  ఒకే మతంలో ఉన్న వ్యక్తులు కూడా  రకరకాల ఆశయాలతో కూడిన పద్ధతులను అలవర్చుకోవడానికి అలవాటు పడతారు.అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము అన్న భావాలు  ఎలా వచ్చాయి  శంకరాచార్య చెప్పిన పద్ధతి  ఆ వ్యక్తి  గుణం ఎలా ఉంటుందో  అతను చేసే పనులు ఎలా ఉంటాయో  ఆరింటి నీ దృష్టిలో పెట్టుకొని నేను విభజించాను అని  గీతాకారునిగా మన ముందు ఉంచిన  సత్యం  సమాజం అంతటితో ఆగకుండా  జాతులలో ఉపజాతులు ఎలా వస్తూ ఉన్నాయో  కులాలలో కూడా  ఉప కులాలు  అలా విజృంభించాయి 
ప్రాథమికంగా కుటుంబ స్థాయి నుంచి సమాజం  పెరుగుతుంది  స్త్రీ పురుషుల  తో కూడినది సంసారం  సారముతో కూడిన జీవితాన్ని కొనసాగించాలి అనుకుంటే  భార్యాభర్త ఇద్దరు కూడా  బాధ్యతలను హక్కులను  కూడా సమంగా పంచుకోవడం జరగాలి  లేకుంటే అధిపత్య  పోరు ప్రారంభం కావడానికి అవకాశం ఉంటుంది  సామాన్యంగా పురుషులలో  ఉండే  ఆత్మ న్యూనతా భావం  తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది  భార్యను ఏ స్థితిలోనూ ఇబ్బంది పెట్టకుండా ఆమె మనసు కష్టపడకుండా చూసుకోవడం అతని బాధ్యతగా చూసుకుంటాడు  అలా ఆ కుటుంబంలో జరగకపోయినట్లయితే  ఒకరికొకరు ఎడమొహం ఎడమొహం  ఆ ఇంటిలో ఏ కార్యక్రమం సక్రమంగా జరగదు
ఈ భూమ్యాకాశాల మధ్య పురుషుడు ఎదుర్కోవాల్సిన అత్యధికమైన సమస్య  భార్యను సుఖవంతంగా ఉంచడం  ఆమెకు ఏ కష్టం కలిగిన సంసారం మొత్తం చిన్నా భిన్నం అయిపోతుంది  కనుక ఎంతో జాగ్రత్త వహించవలసిన బాధ్యత పురుషునిపై ఉన్నది  అతనిలో ఉన్న  బలహీనత  మన్మధ బాణాల తాకిడికి ఏ మగవాడు కూడా తట్టుకోలేడు  చివరకు  పార్వతీదేవి కోసం మన్మధుడు చేసిన  ప్రయత్నం  శంకరుని  వశపరచుకోవడం  అలాంటి దంపతులకే  తప్పని  పని సామాన్య మానవుని వల్ల అవుతుందా  కనుక ప్రతి భర్త భార్యకు దాసుడై ఉండకుండా ఉండలేడు అని వేమన నిర్ధారించాడు  వారు రాసిన పద్యాన్ని చదివితే  ఆ వాక్యాలను ఎందుకు అన్నారో మనకు అర్థం అవుతుంది  ఒకసారి ఆ పద్యాన్ని చదవండి.

"తుంట వింటి వాని తూపుల ఘాతకు మింట మంటనడుమ మిడుక దరమె యింటయాలు విడిచి యట్లుండవచ్చురా..."


కామెంట్‌లు