ప్రకృతి ధర్మం;- ఏ.బి ఆనంద్,-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322
 మానవుడు ఎవరైనా సరే  తన మనసులో కొన్ని కోరికలు  తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అతను ఆ పనిని చేయగలడా లేదా  ఆ సామర్థ్యం ఉంటే  దానిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి  లేకపోతే దానిని ఎలా సాధించాలి  అన్న విషయాలను ఆలోచించుకుంటూ  జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు కొంతమంది ఉంటారు  వారి జీవితం మొత్తం ఆలోచనలతోనే మునిగిపోతుంది  దానికి  తుది  అంటూ ఏదీ లేదు  దీనినే మన పెద్దవాళ్లు పగటి కలలు కనడం మాను  కలల వల్ల పనులు కావు  స్వయం కృషితో  పెద్దల  సలహాలను పాటిస్తూ  నీవు చేయదలుచుకున్న పనిని సక్రమంగా చేయాలి తప్ప  ఇలా ఉండడం వల్ల  జీవితంలో ఏ విధమైన ప్రయోజనం ఉండదు  అని సలహాలు ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం.
ప్రకృతి ధర్మం ప్రకారం  ఎప్పుడు ఏది జరగాలో అది ఆ సమయంలో జరిగితీరుతుంది  దీనికి ఏ మానవుడు బాధ్యత వహించవలసిన అవసరం లేదు  ఏ ఋతువు లక్షణాలు ఆ ఋతువుకు. ఉన్నాయి  మనకున్న ఆరు రుతువులలో  ఆరు ధర్మాలను ప్రకృతి సిద్ధంగా  అది జరిగిపోతూనే ఉంటాయి. దానిని అడ్డుకోవాలని చూసినా ఎంతమంది ప్రయత్నం చేసినా అది వారి వల్ల కాదు  అసాధ్యమైన విషయాల జోలికి వెళ్లడం     బుద్ధిమంతుల లక్షణం కాదు  అనుకుంటూ కాలక్షేపం పనిచేస్తూ ఉంటాడు  మరి అతనిని అసమర్ధుడు  అనాలో  బలహీనుడు అనాలో  బద్ధకస్తులు అనాలో ఎవరికీ తెలియదు  కారణం అతనిఆలోచనలలో  ఏమాత్రము నిలకడ అతనికే లేదు  అంటాడు వేమన.
కానీ పని ఏదైనా చూసి అది చేయడానికి ప్రయత్నం చేసిన వాడు  మూర్ఖునితో సమానం  అసాధ్యమైన విషయాలను సాధ్యం చేసుకోవాలని ప్రయత్నం చేయడం  అమాయకుల లక్షణం  అతను ఎన్ని రకాల ప్రయత్నించిన  ఆ పని జరగదు  ఈ ప్రపంచాన్ని నడిపే విధి ఒకటి మనకు తెలియకుండా  ఉన్నది అని పెద్దలు కూడా చెబుతూ ఉంటారు  వారు చెప్పిన మాటలను విని మనం తప్పుకోవడం శ్రేయస్కరం  విధికి ఎదురు వెళ్లే వ్యక్తి ఎవరు  సజీవంగా ఉన్న  ఆనవాళ్లు మనకు కనిపించవు  మన వల్ల అయ్యేది ఏమీ లేదు  దైవం ఏది చేయదలుచుకుంటే దానినే చేస్తుంది తప్ప మానవ ప్రయత్నం వల్ల అది సాధ్యం కాదు  అని వేమన స్పష్టం చేస్తున్నాడు వారు రాసిన పద్యాన్ని ఒకసారి చదవండి  మనకు విషయం తెలుస్తుంది.


"కాగల పనులెల్ల గాకెటుబోవును కాని పనులు కానె కావు భువిని మహిమ వేరెయుండ మన తోడనున్నదా..."

.

కామెంట్‌లు