మా గ్రామంలో పెద్ద భూస్వాములలో ఒకరు భీమవరపు కోటి రెడ్డి గారు వారు కూడా వామపక్ష సిద్ధాంతాలకు అనుకూలంగా ప్రవర్తించిన వ్యక్తి గ్రామానికి సంబంధించిన అనేక విషయాలలో తాను కూడా గొప్ప దానాలు చేశాడు వాళ్ళ అబ్బాయి కృష్ణమోహన్ అమ్మాయి భారతి మాతో పాటు చదివిన వారే మాతో పాటు వారు కూడా ప్రథమ శ్రేణిలోనే ఉండేవారు కృష్ణ నేను రాధాకృష్ణ ఇస్మాయిల్ అంతా ఒక జట్టుగా ఉండేవాళ్ళం ఉన్నత పాఠశాలలో చదినంతవరకు మాకు చదువులో కానీ ఆటలలో కానీ సాంస్కృతిక కార్యక్రమాలలో కానీ పోటీ ఉండేది కాదు అలా ఆరు సంవత్సరాలు ఉన్నత పాఠశాలను పరిపాలించిన విద్యార్థులం కనుక అంతా మాతో సన్నిహితంగా ఉండేవారు. భారతి తో పాటు చదివిన స్వరాజ్యం మాతోపాటు మంచి మార్కులు తెచ్చుకుంటూ ఉత్తమ శ్రేణి విద్యార్థినిగా ఉండి ఆమె ప్రవర్తన నచ్చి భారతి వాళ్ళ నాన్న గారితో చెప్పి తనకు వదినగా చేసుకుంది. ఆమె కుమారుడు సోమశేఖర్ రెడ్డి చదువులో మంచి మార్కులతో పెద్దల పేరు నిలబెడుతూ చదివాడు మొదటినుంచి అటవీ శాఖ అంటే ఎంతో ఇష్టంగా ఉండేవాడు ఆ శాఖలో ఉద్యోగం చేయాలన్న అభిప్రాయంతో ఎంతో కష్టపడి అక్కడి ఆనుపానులన్నీ తెలుసుకొని 1978 నవంబర్లో అటవీ శాఖలో చేరడానికి అధికారిగా ఉండడానికి పరీక్ష వ్రాస్తే ఐ ఎఫ్ ఎఫ్ కు మన రాష్ట్రం నుంచి వెళ్లిన పదిమందిలో ప్రథముడిగా ఎంపికైనవాడు అలా మా గ్రామంలో అటవీ శాఖలో పనిచేసిన అధికారిగా అందరి మన్ననలను పొందిన వాడు
1992లో భీమవరపు సంస్థను స్థాపించి ప్రతి సంవత్సరం నలుగురు వృద్ధులకు పెన్షన్ ఇస్తున్నాడు నేను విశాఖపట్నం లో ఉన్న సమయంలో ఆ సంస్థకు సంబంధించిన విషయాలను అన్నిటిని ఆకాశవాణిలో ప్రసారం చేయాలి అన్న కోరికతో నా దగ్గరికి వచ్చి ఒకటి రెండు పరిచయ కార్యక్రమాలు కూడా చేసిన తర్వాత అరణ్యాలు దానికి సంబంధించిన ఇతర విషయాలను అన్నిటిని నా ద్వారా ప్రసంగాల పద్ధతిలో శ్రోతలకు అందజేయడానికి దానికి సంబంధించిన విశేషాలు అన్నీ వ్రాసి తనకన్నా నేను చదవడం వల్ల శ్రోతలలోకి వెళుతుంది విషయం
అనే అభిప్రాయంతో నాతో ప్రసంగాలు చేయించేవాడు అలా తాను ఏ సంస్థలో పనిచేస్తున్నాడో దాని మంచి చెడులు దాని ఉన్నతి కోసం పనిచేస్తున్నాడు పై అధికారులు అందరి వద్ద అభినందనలు పొందుతున్న వాడు మరింత కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నవాడు మా గ్రామ వాసి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి