నేను బదిలీపై విశాఖపట్నం వెళ్ళినప్పుడు వాడు బదిలీతో శ్రీకాకుళం వచ్చాడు అక్కడ ఉద్యోగం చేస్తున్న రోజుల్లో అనేక పర్యాయాలు మా కేంద్రానికి వచ్చి కవితలు చదవడం నాటకాలు ఇవ్వడం చర్చ గోష్టి లాంటి సాహిత్య కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది వాటన్నిటిని నేనే నిర్వహించేవాడిని తేలప్రోలు నుంచి వెళ్లి విశాఖపట్నం లో ఇల్లు కొని శ్రీకాకుళం విజయనగరాల్లో ఎస్ ఐ గా ఉద్యోగం చేస్తున్న మా మరో మిత్రుడు ప్రసాద్ ను స్మైల్ విశాఖపట్నం వచ్చిన ప్రతిసారి కలవడం వారింటికి వెళ్లి వాడి పెంపుడు కుక్కతో కాలక్షేపం చేసేవాళ్ళం ముస్తఫా, వచ్చిన ఇంతియాజ్ ముగ్గురు ఆడ పిల్లలతో ఆనందమయ జీవితం గడుపుతూ ప్రశాంతంగా కాలం వెళ్లబుచ్చేవాడు ఎప్పుడు విషాదఛాయలు మొహం మీద కనిపించలేదు.
వాడు రాసిన అద్భుత కళా సృష్టి ఖాళీ సీసాలు ఇది దేశ విదేశాలలో కూడా పేరు ప్రఖ్యాతులు వచ్చిన గ్రంథం వలసముద్రం పృథ్వి వాడి ఇతర రచనలు ఆ అనే నాటకం తనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టింది వాడు చేసిన అనువాద గ్రంథాలన్నీ కూడా విద్యార్థులకు ఉపయుక్తమైన పాఠ్యాంశాలు తన ఉద్యోగ జీవితంలో ప్రత్యేకించి దిగువ తరగతి వ్యక్తులను ఎన్నిక చేసుకొని వారికి కావలసిన సదుపాయాలన్నీ ప్రభుత్వం తరఫున తాను చేసేవాడు గుప్త దానాలు కూడా చాలా చేసినట్లు నాకు తెలుసు ఎవరిని పల్లెత్తు మాట మాట్లాడడం కానీ ఒకరి గురించి మరొకరి దగ్గర చెడుగా మాట్లాడడం కానీ వాడి జన్మలో ఎప్పుడూ జరగలేదు నిజాయితీకి పెట్టింది పేరు అలాంటి మంచి మిత్రుడు దొరకడం మా అదృష్టం.
మా అన్నయ్య పుల్లారెడ్డి నేను మా గ్రామం తేలప్రోలు అనే పేరుతో మాకు ఎవరికీ తెలియని అనేక విషయాలను పొందుపరిచి వ్రాసిన గ్రంథాన్ని ఆవిష్కరించడానికి ఎవరిని పిలవాలా అని ఆలోచిస్తున్న సమయంలో మా కుటుంబానికి అత్యంత సన్నిహితులు డాక్టర్ కే వెంకటరాజు గారిని అధ్యక్షుడిగా పిలవాలని నిర్ణయించుకున్నాం మా గ్రామంలో పుట్టిపెరిగిన వాడు కనక ఇస్మాయిల్ ను పిలిచాము ఆంధ్రజ్యోతితో స్మైల్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కనుక దాని సబ్ ఎడిటర్ చౌదరి గారిని ఆహ్వానించాం తేలప్రోలు లో మా స్నేహితులందరి మధ్య చక్కగా పుస్తకాన్ని ఆవిష్కరించాం తర్వాత అందరికీ చక్కటి విందుని ఇచ్చాం ఆరోజు వాడి ఆనందానికి అవధులు లేవు.
మన గన్నవరం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి