అన్న ప్రసాదం - ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ,9492811322.
 సనాతన ధర్మానికి ఓ స్త్రీ ప్రతీక అని చెబుతూ ఉంటారు  ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రించే వరకు మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా  ప్రణాళికాబద్ధంగా అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలి అంటే  తప్పకుండా ఈ శాస్త్రీయతతో కూడిన సనాతన ధర్మం ఉండి తీరాలి  అని పెద్దల  ఉ వా చ  మనం భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు  దానికి తగిన పద్ధతిలో  ముందు కూర్చునే మన శరీరాన్ని  మన అధీనంలో ఉంచుకోవడం  ఏ పదార్థాన్ని తినాలని అనుకుంటున్నామో దాని పై మనసుపెట్టి  పద్మాసనం వేసుకుని కూర్చుని  గృహిణి వడ్డించిన తరువాత  ఆ పదార్థాలు  చుట్టూ  ఆపోసన చేసి  తరువాత మొదటి ముద్ద భగవంతునికి అర్పణ చేస్తూ  నీ దయ  కృప వల్ల నాకు ఈ పదార్థం దొరికింది అని చెప్పి తర్వాత తినాలి ఇది వైదిక ధర్మం. ఇవాళ భోజనాలు ఎలా జరుగుతున్నాయి  సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం  తన బంధు మిత్రులందరికీ పంక్తి భోజనాలు మానివేసి  పదార్థాలన్నీ అప్పటికప్పుడు వేడివేడివి వడ్డించడానికి అన్నదృష్టితో  అన్నం ఒకచోట కూర ఒకచోట  ఇంకొక పదార్థం ఒకచోట చివరి పదార్థం ఆ చివరన  ఇలా మనం భోజనానికి వెళతాం  అక్కడ బఫే పేరుతో  ఎదుటివాడు ఏం తింటున్నాడో చూసి ఆ పదార్థం ఎక్కడ దొరుకుతుందో  అతనిని అడిగి తెలుసుకుని ఆ ప్రాంతానికి వెళ్లే లోపు ఆకలి చచ్చిపోతుంది  అక్కడ ఏర్పాటు చేయడానికి ఈ చివర నుంచి ఆ చివరి వరకు దాదాపుపాతిక 30  పదార్థాలు ఏర్పాటు చేస్తారు అన్నీ వెతికి తినడానికి అవకాశం కూడా ఉండని స్థితిలో మనం భోజనాలు పెడుతున్నాం  దానిని సరైన పద్ధతి అందామా. మనవాళ్లు చాలామంది భోజనాలు ఏర్పాటు చేసినప్పుడు  ఉచితంగా  దానిని అన్నదానం అనే పేరు పెడతారు  ఆ మాట వింటే  పెద్దలకు కోపం వస్తుంది  అన్న సంతర్పణ అని మరి కొంతమంది వాడతారు  కానీ  భోజనం అనేది ఈ ప్రకృతి మనకు అందించిన శక్తి స్వరూపం  దానిని భగవంతుని కృపగా భావించి ఏదైనా పేరు పెట్టండి  దానిని  అన్న ప్రసాదం అనాలి తప్ప  మరొక పేరుతో పిలవకూడదని పెద్దలు చెబుతారు  ఆ తినేటప్పుడు  వైదిక సంప్రదాయాన్ని అనుసరించి చేసినట్లయితే ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది జీవితంలో వృద్ధాప్యం రాకుండా పోతుంది అని మనవారు నమ్ముతారు  ఆ విషయాన్ని తెలియజేయడం కోసం వేమన  మనకు అందమైన  ఆటవెలదిని అందించాడు  ఆ పద్యాన్ని చదవండి  మీకు తెలుస్తుంది.

"ఇంచుకంత బోనమీశ్వరార్పణమన్న పుణ్యలోకమునకు బోవునతడు అన్నదానమునకు నధికదానము లేదు..."


కామెంట్‌లు