మన గన్నవరం;- ఏ.బి ఆనంద్,-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322

 మేము  వివాహాలు  చేసుకొని ఇద్దరం విజయవాడలోనే ఉద్యోగస్తులై స్థిరపడ్డాం. నేను ఆకాశవాణి లో చేరాను. వాడు లెక్చరర్ అయ్యాడు.  మొదటినుంచి వాడిలో చక్కటి  అన్వేషణ ఉన్న విషయం నేను గమనించాను  వెన్నెల రోజుల్లో మేము ఆడుకుంటున్నప్పుడు  సూర్యుడు చంద్రుడు ఆకాశంలో ఉన్నాడు కదా అక్కడ వేడెందుకు వస్తుంది అనేది  వాడి సందేహం  ఆ వయసులో మాకు గ్రహ పరిస్థితి ఏం తెలుస్తుంది  అయితే తాను మాత్రం  పట్టిన పట్టు విడవకుండా  ఎమ్మెస్సీ పూర్తి చేసిన తర్వాత  ఖగోళ శాస్త్రానికి సంబంధించిన విషయాలను పరిశోధించి పరిశీలించి  పీహెచ్డీ కూడా పూర్తి చేశాడు  మొదటి నుంచి మాలో ఉన్న గుణం  మాకు తెలిసిన విషయాలను ఇతరులతో పంచుకోవడం  దానివల్ల మనకు తెలియని కొత్త విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది  అని అలా చేసేవాళ్లం. లెక్చరర్ గా పనిచేస్తున్న సమయంలోనే  ఆకాశవాణికి అనేక సందర్భాలలో ఖగోళ శాస్త్రాన్ని గురించి  ప్రసంగాలను  ఇస్తూ చర్చా కార్యక్రమాల్లోనూ గోష్టి కార్యక్రమాల్లోనూ పాల్గొనేవాడు. మాకు మొదటనుంచి ఎలక్త్యూషన్ లో అలవాటు ఉండటం వల్ల  ఎదుటివారితో వాదించడానికి  అనుకున్నది అనుకున్నట్లుగా విశ్లేషించడానికి  మాకు అవకాశం ఎక్కువగా ఉండేది  తాను చెప్పిన విషయాన్ని  ప్రత్యర్థులు ఎంత  గొప్పగా వాదించినా చివరకు తర్కశాస్త్రాన్ని ఉపయోగించి  వారిని ఓడించడంలో  ప్రథమ శ్రేణిలో ఉండేవాళ్ళం. ఉన్నత పాఠశాలలో చేసిన కార్యక్రమాలన్నీ మాకు నిజ జీవితంలో ఎంతో ఉపయోగకారిగా ఉన్నాయి  మా అధికారుల చేతకాని  విద్యావంతుల వల్ల కానీ  ఎలాంటి మాటలు పడే అవసరం రాలేదు. నేను,నండూరి సుబ్బారావు గారు  కలకత్తా వెళ్ళినప్పుడు అక్కడ శాస్త్రి గారు అని ఒక తెలుగు వ్యక్తి  అక్కడ శానిటోరియంలో ఖగోళ శాస్త్రాన్ని గురించి చెప్పడం అటు ఆంగ్లంలోనూ ఇటు బెంగాలీ లోను కూడా మాట్లాడడం  మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది  మన ఆంధ్రుడు ఏ ప్రాంతానికి వెళ్లినా  తల దించుకునే పని చేయడు అనేది   స్పష్టంగా తెలిసింది  ఆ తర్వాత విజయవాడలో  గాంధీ కొండపై ఏర్పాటు చేసిన  దాని నిర్వహణ  ముక్కామల నాగభూషణం గారు తీసుకున్నారు. ఆయన చదివింది చాలా తక్కువ  కానీ ఖగోళ శాస్త్రం  ప్రత్యక్ష ప్రసారంలో ఆయన చెప్తూ ఉంటే ఆ జ్ఞానానికి ఆ పద్ధతికి కూడా తల వంచి పాదాభివందనం చేయవలసినదే.

కామెంట్‌లు