ఆడపిల్ల చదువులో పడి ప్రపంచ జ్ఞానాన్ని మర్చిపోతుంది దానిని జ్ఞాపకం చేసేవాడు పురుషుడు ఆమెతో చదువుతున్న విద్యార్థి ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్తూ ఉంటాడు అందమైన శరీరం తయారు అయిన తర్వాత ఇంతకు మించిన అందం మరి ఎవరికి ఉండదు నేనే గొప్ప అందగత్తెను అని మిడిసిపడుతూ ఉంటుంది ఆ అందం వయసుకు సంబంధించినా వివాహమైపోయి జీవితంలో స్థిరపడి భర్తతో కాపురం చేస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉన్న ఆమె ఒక శుభ ముహూర్తంలో గర్భాన్ని ధరిస్తుంది 9 నెలలు మోసిన తర్వాత ఆ బిడ్డ భూమి మీదకు వస్తుంది అప్పుడు ఆ తల్లి అందం ఎలా ఉంటుంది తన అందమంతా బూడిదలో పోసిన పన్నీరుగా మారుతుంది అంటాడు వేమన.వేషాలు వేసి ప్రజలను మోసగించడానికి వచ్చి ఎన్నో వేదాంత ప్రక్రియలు నేను మొనగాడిని మీ అందరికీ జ్ఞానాన్ని ఉపదేశించడం కోసం నేను ఇక్కడికి వచ్చాను నేను చెప్పే ప్రతి ఒక్కదాన్ని మీరు శ్రద్ధగా విని జీవితాలను బాగుపరుచుకోండి అంటూ చెప్పే వ్యక్తులు ఈరోజు మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నారు. అదే వేషంతో భిక్షాటన చేసే వ్యక్తికి ఇతనికి ఏమిటి భేదం అని అడుగుతున్నాడు వేమన ఇల్లిల్లు తిరిగే ఆ సన్నాసి ఆకలైతే చక్కగా భోజనం చేస్తాడు నలుగురు గృహిణిలు పెట్టిన పదార్థాలతో. మరి ఉపన్యాసాలు ఇచ్చే ఈ గురువు ఆకలైతే కడుపులో ఎరుకలు దూరి బాధ పెడుతూ ఉంటే ఆకలిని ఆచారం అంటూ ఆగిపోతాడా తనూ మానవమాత్రుడే కదా ఆకలి బాధ ఎవరికైనా ఒకటే అందుకే దానికి ప్రాధాన్యమిస్తాడు.
ఈ జీవితంలో మనం ఏ కుటుంబంలో చూసినా భార్యాభర్తల ప్రవర్తన ఎలా ఉంటుంది ఇంటికి సంబంధించిన ప్రతి పనిని గృహిణి చేస్తూ ఉంటుంది అది చెయ్ ఇది చెయ్ అని గృహస్తు అజమాయిషి చేస్తుంటాడు భర్త అంటే భరించేవాడు అని కదా అర్థం నిన్ను కూడా నేను భరిస్తున్నాను కనుక నీవు నేను చెప్పినట్లుగా చేయాలి అని భీష్మించుకు కూర్చుంటాడు తప్పదనుకుని ఆమె అన్ని పనులు చేయడానికి సిద్ధమవుతోంది రాత్రి ఆకలి బాధ తీరిన తర్వాత పరిపాలించేది ఎవరు పక్కన ఆమె మరి చీకటి పడిన తరువాత ఏ మగవాడైనా ఆడదాని చేతిలో కీలుబొమ్మ అవకతప్పదు ఆమె చెప్పినట్లుగానే విని తీరాలి అంటూ చక్కటి పద్యాన్ని వ్రాశాడు వేమన దానిని చదవండి ఒక మారు.
"ఆకటికి దొలంగు నాచార విదులెల్ల చీకటికి దొలంగు చిత్తశుద్ధి వేకటికి దొలంగు వెనుకటి బిగువెల్ల..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి