యజ్ఞాలు-యాగాలు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 భారతదేశంలో యజ్ఞాలు యాగాలు క్రతువులు చేయడం  సర్వసాధారణం  క్రతువు గ్రామస్థాయిలోనే చేయవచ్చును యాగాలు  యజ్ఞాలు చేయడానికి  ఎన్నో నియమ నిబంధనలు ఉన్నాయి  యాజ్ఞకులు రావాలి   ఘనాపాటి  ఉండాలి. యజ్ఞ పశువు ఉండాలి  అనేక హంగులతో కూడిన యజ్ఞం చేయడం ప్రతి ఒక్కరి  వల్ల కాదు  ఖర్చుతో పాటు దాని పద్ధతి కూడా తెలియాలి  జ్ఞానులలో  రెండు రకాలను చెప్తున్నాడు వేమన  పూర్తి జ్ఞానం కలిగిన వారు ఒక రకం  వారు జ్ఞాన సంపత్తితో చేయదలచిన కార్యక్రమాలను దేనినైనా అవలీలగా చేయగలరు  రెండవ రకం అల్పజ్ఞానంతో ఉంటారు  కొంచెం కొంచెం తెలిసినవాడు  మిడి మిడి ధ్యానం తప్ప  గ్రంథాలు చదవలేదు  యజ్ఞాలను చూడను కూడా చూడలేదు. యజ్ఞం చేసేటటువంటి  యాజ్ఞకులు  అనేక రకాల నియమ నిబంధనకు  లోబడి పని చేయవలసి ఉంటుంది  దానికి కావలసిన వస్తుసంభారాన్ని  ముందు రాసి  దాని నిర్వాహకులకు ఇచ్చి  వారు చెప్పిన అన్ని పదార్థాలు వచ్చినవా లేవా అని  లెక్క గట్టి చూసి  ఎలాంటి దోషాలు లేని సమయాన్ని ఎన్నిక చేసి  ఫలానా సమయం నుంచి ఫలానా సమయం వరకు ఈ కార్యక్రమం ఉంటుంది  భార్యాభర్తలు సిద్ధంగా ఉండండి  మీ బంధువులను స్నేహితులను  ఆత్మీయులను  ఆహ్వానించుకోండి  అని  అనుమతి తీసుకుని  కార్యక్రమాలు ప్రారంభిస్తారు  ఒక్కొక్కటి  అగ్నికి ఆహారం ఇస్తూ  చివరికి జంతుబలిని కూడా  తప్పనిసరిగా  ఇచ్చే సంప్రదాయం ఉంది  ఒక మూగప్రాణి జీవితం దానికి అంకితం. ఇలా చేయడం వల్ల  దేవతలు సంతోషిస్తారని  తమ పూర్వీకులు  ఒకవేళ నరకంలో ఉన్నవాడు కూడా స్వర్గలోకానికి వెళతారని వీరి నమ్మకాలు  దీనివల్ల  యజ్ఞం చేయటం ద్వారా రావలసిన  పుణ్యం మాట అలా ఉంచి  మూగ జంతువు నిండు ప్రాణాన్ని తీసిన పాపం  వారికి తగిలి  వారి మరణానంతరం  నరక లోకానికి వెళ్ళక తప్పదు  అని చెబుతూ ఒక ఉదాహరణ ఇచ్చారు వేమన  ఒక కుక్క ఇంటిలో దూరి అక్కడ ఉన్న కుండలో అన్నాన్ని తినగలదు తప్ప  ఆ అన్నం ఉన్న కుండను మోయలేదు కదా. అలా ఉంటుంది తెలిసీ తెలియని వారు చేసే యాగాల పరిస్థితి  అని నిర్మోహమోటంగా చెప్పిన ఈ పద్యాన్ని ఒకసారి చదవండి మనకు కూడా ఆ రహస్యం ఏమిటో తెలుస్తుంది.

"అధికమైన యజ్ఞమల్పుండు తాజేసి మొనసి శాస్త్రము విడి మురువు దక్కు దొబ్బ నేర్చుకున్న దుత్తలు మోయునా..."



కామెంట్‌లు