మన గన్నవరం;- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఒక్కొక్క కుటీరానికి ఒక్కొక్క పేరు పెట్టేవారు ఆదర్శ కుటీరము అభ్యుదయకుటీరము ఆనంద కుటీరము కేసరి కుటీరము అన్న పేరులు ఉండేవి ఒక విద్యార్థి కావలసి వచ్చిన విద్యార్థిని కావాలన్నా ఫలానా కుటీరంలో ఉంటారు అని చెప్పేవాడు  ఉదయం నాలుగు ఐదు గంటల మధ్యలో కాలకృత్యాలు తీర్చుకొని ప్రతి విద్యార్థిని ప్రార్థన స్థలానికి వచ్చేవారు  దేశభక్తి ప్రార్థన పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు అందరూ కలిసి ప్రమాణము చేసేవారు  ఐక్యత దేశమును ప్రేమించడం విద్యాభ్యాసం మొదలైన వాటి గురించి. ఉదయం జవ ఇచ్చేవారు అది తాగిన తర్వాత ఎవరి గుడారానికి  వారు వెళ్లేవారు ఏడు గంటల నుంచి 11 గంటల వరకు అప్పుడు ఎవరి పళ్ళెము గ్లాసు  వారు తీసుకొని శుభ్రం చేసుకుని అప్పుడు భోజనానికి వెళ్ళేవారు. గురుకులానికి ఒక ఫర్ లాంగ్ దూరంలో వంటపాక వేశారు భోజనానంతరం గంటన్నర విశ్రాంతి ఇచ్చేవారు  తిరిగి ఎవరి తరగతికి వారు వెళ్లేవారు సాయంత్రం నాలుగు గంటలకు స్కూలు గంట కొట్టేవారు అప్పుడు అందరికీ టీ ఇచ్చేవారు  సాయంత్రం ఆట స్థలాలకు వెళ్లడం  విద్యార్థులతో చెడుగుడు బ్యాట్మెంటన్ ఫుట్బాల్ వాలీబాల్ రన్నింగ్  హై జంప్, లాంగ్ జంప్, పోల్ జంప్ మొదలైన ఆటలు ఆడించేవారు  బాలికలకు రింగ్ బ్యాట్మెంటన్ పరుగుపందాలు ఉండేవి  మహారాష్ట్ర నుంచి తాంబేజి గారానే డ్రిల్ టీచర్ ను  తీసుకొని వచ్చారు వారు రీజన్స్ డంబేట్స్ మొదలైనవి అనేక విధమైన కొత్త కొత్త  డ్రిల్స్  చేయించేవారు  ఆటలై పోయిన తర్వాత స్నాన సంధ్యాదులు చేసేవారు అన్ని రకాలైన కులస్తులు ఉండేవారు భాష వేషం రకరకాలుగా ఉండేవి. రాత్రి భోజనం అయిపోయిన తర్వాత ఎవరి కుటీరానికి వారు వెళ్లేవారు  ఏ ఏ కుటీరానికి కేటాయించిన ఉపాధ్యాయులు ఆయా కుటీరాల విద్యార్థులను శ్రద్ధగా చదివించేవారు  ముఖ్యంగా చేతివృత్తులు శ్రద్ధగా చేయించేవారు  క్రాఫ్ట్ డ్రాయింగ్ కూడా నేర్పేవారు చెక్క గుండీలు  ప్లైవుడ్ చెక్కపై ఒక బొమ్మ గీసేవాడు పుత్రుడు పశువులు మనుషులు బొమ్మలు వాటిని సన్నని రంపముచే వేస్ట్ ముక్కలు కోసి మిగిలిన బొమ్మ వచ్చేలా చేసేవారు  వాటికి రంగులు కూడా వేయించేవారు యువకులు అలకటం తయారు చేయడానికి  పక్కిరియలపై దారం తీయడం నవ్వారు నేయడం మొదలైన  విషయాలను ఎన్నిటినో నేర్పేవారు  ప్రతి విద్యార్థిని  విద్యార్థి ఎంతో ఉత్సాహంతో వాటిని నేర్చుకోవడానికి  కుతూహలం చూయించేవారు.


కామెంట్‌లు