మన గన్నవరం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322

 పాటిబండ మాధవ శర్మ గారు  వీణ పత్రిక ఆపు చేసిన తర్వాత 1939లో తేలప్రోలు గ్రామ పెద్దలను సంప్రదించి ఒక గురుకులాన్ని స్థాపించాలని నిర్ణయించారు. పాటిబండ శ్రీమన్నారాయణ గారి సలహా మేరా విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రారంభించిన శాంతి నికేతన్ మోడల్ లో విద్యను నేర్పాలన్న ఉద్దేశంతో  ఆంధ్రప్రదేశ్ మొత్తంలో  ఇప్పటి రెసిడెన్షియల్ స్కూల్ పద్ధతిలో ఉదయభారతి గురుకులం ప్రారంభం కావడం గ్రామానికి గర్వకారణం. 26-6-39న  వింత మంగి రెడ్డి గారి సత్రములో ఏలూరు కాలువ ప్రక్కన ప్రారంభించారు అక్కడ ప్రశాంతత ఉండదని గ్రామానికి దూరాన ఉన్న సొంత పొలం గరువులో  ప్రారంభించారు  తన సొంత ఆరు ఎకరాల పొలంలో పాకలు వేయించి ప్రక్కన ఒక చెరువు ఉన్నది దానిని ఇప్పటికీ ఉదయభారతి చెరువు అంటారు. ఉదయభారతి గ్రామాలకు సంబంధించిన చక్కటి వాతావరణం కల్పించాలని ఆ కుటీరాలలోకి  సత్రం నుంచి తరలించారు  ముఖ్యంగా చదువుతో పాటు లలిత కళలు చేతివృత్తులు యోగ వ్యాయామ ఆటలు వక్తృత్వ పోటీలు వ్యాసరచనలు మొదలైన ఎన్నో అంశాలను బోధించాలని ప్రణాళికను సిద్ధం చేశారు.  విద్యార్థులు పలు దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఆ రోజుల్లోనే విజయనగరం విశాఖ శ్రీకాకుళం రాజమండ్రి తాడేపల్లిగూడెం తెలంగాణ రాయలసీమ ప్రాంతాల నుంచి కూడా వచ్చేవారు  అప్పటికే గురుకుల విద్యాబోధన ప్రచారమైంది విద్య నేర్చుకోవాలన్న అభిలాషతో వచ్చేవారు చాలామంది  తేలప్రోలు విద్యార్థిని విద్యార్థులకు ఒంటెద్దు బండిని ఏర్పాటు చేశారు. తేలప్రోలు ఊరు చివరకు ఉదయభారతి నాలుగు మైళ్లు ఉంటుంది ఇక్కడ నుంచి పది పన్నెండు సంవత్సరాల వయస్సు గల విద్యార్థులు వచ్చేవారు  ఒంటెద్దు బండిని ఉదయం పంపి గురుకులానికి తీసుకుని వారు అక్షరాభ్యాసం నుంచి కూడా ఉండేది జవ, భోజనం మధ్య ఇచ్చేవారు సాయంత్రం అయ్యేసరికి సాయంత్రం మూడు నాలుగు గంటల ప్రాంతంలో అక్కడి నుంచి బండిమీద పిల్లల్ని వారి వారి ఊర్లకు పంపించేవారు  కొంతకాలం జరిగిన తర్వాత ఈ పిల్లలను కూడా ఉదయభారతిలోనే  ఉంచారు  రోజు చాలా సరదాగా ఉండేది బండి ప్రయాణం  విద్యార్థుల వసతి కొరకు తయారు చేయబడిన కుటీరంలో 15-20 మంది విద్యార్థులను అలాగే ఒక్కొక్క కుటీరంలో ప్రత్యేకంగా బాలికలను ఉంచే ఏర్పాటు చేశారు.

కామెంట్‌లు