మాయ;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 భారతీయులందరికి భారత రామాయణాలు తెలుసు  వాల్మీకి మహర్షి రామాయణంలో  రాముని తత్వాన్ని  వారి గమనాన్ని  చదివే వారికి అర్థమయ్యే పద్ధతిలో స్పష్టంగా చెప్పారు  ఆయనకు  విధి నిర్ణయం తప్ప మరొకటి లేదు  ఏది ధర్మమో దానిని ఆచరించడం మాత్రమే రామునికి తెలుసు  గాయత్రి మంత్రం లో ఉన్న 24  అక్షరాలకు 24  మానవ ధర్మాలు ఏవి ఉన్నాయో వాటిని ఆచరించి చూపిన వాడు రాముడు. దీనికి అతీతంగా కృష్ణ శబ్దాన్ని తీసుకొని  వ్యాస మహర్షి శ్రీ కృష్ణ పరమాత్ముని లీలలను  ఆయన పద్ధతులను  భారతం చదివే వారికి  కళ్ళకు కట్టినట్లు గా చూపించారు  ఆయన బాల్య చేష్టల నుంచి  చివరి వరకు  ఆయన ప్రదర్శించిన  ప్రతిదీ  ఒక పాఠమై కూర్చుంది  ఆ రెంటి భేదాన్ని విశ్లేషించడం కొరకే  ఆ రెండు గ్రంథాలు ఆవిష్కరించబడ్డాయి.
శ్రీకృష్ణుడు చేయలేని మాయ లేదు భారతంలో కానీ భాగవతంలో కానీ  భాగవతంలో వ్యాసుల వారి కన్నా  అనువదించిన బమ్మెర పోతనమాత్యులవారు చదివే వారి మనసులను దోచుకున్నారు  శ్రీకృష్ణ పరమాత్మ ప్రతిలీలను  ఒక అద్భుతమైన కథగా చెప్పి  చివర  రాక్షస సంహారం  వారి ధ్యేయం  అన్న విషయాన్ని స్పష్టంగా అర్థమయ్యేలా వివరించారు  అలాంటి మాయలు మంత్రాలు చేయడం  శ్రీకృష్ణునికి అలవాటు  దుష్ట సంహారానికి అదొక మంత్రంగా ఉపయోగించాడు ఆ భగవత్ స్వరూపుడు  అలా కాకుండా మానవ ప్రయత్నాన్ని  ఆవిష్కరించి  మంచి నైనా చెడు నైనా ఎలా  చేయాలో  మానవుని కృషి ద్వారా సాధించి  ఇది మానవత్వం  అని చాటి చెప్పిన వాడు వాల్మీకి మహర్షి  ఆ రెంటి భేదం తెలిస్తే జీవితం అర్థం అవుతుంది. మాయ అనేది  చెరసాల  మనసు అనేది సంకెళ్లు  వేదము అనేది ఒక బండ  ఈ బంధాల్లో చిక్కుకున్న వ్యక్తికి  ముక్తి అనేది సాధ్యమవుతుందా  అని వేమన ప్రశ్నించి  చెరసాలలో ఉంచిన శ్రీకృష్ణ పరమాత్మ జీవితానికే ప్రాధాన్యత నిచ్చి మానవాళికి నీతిని బోధించిన వాడు ఎన్ని సంకెళ్ళు వేసినా ఆ సంకెళ్లను మొత్తం తెంచుకొని  బయటపడి  మానవులు కూడా మాయ సంసారంలో పడి చిక్కుకోకుండా  న్యాయంగా జీవితాన్ని కొనసాగించండి అని నీతిని మనకు తెలియజేస్తున్నాడు  అలాగే జీవితంలో మనకు ఎదురయ్యే అనేక కష్టాలు  ఈ బ్రతుకు బ్రతకడం కన్నా  రాతి బండలా ఉండడం మంచిది అనుకునే వారికి అడ్డు లేకుండా ఎలా చేసుకోవాలో చెప్పినవాడు శ్రీకృష్ణ పరమాత్మ  ఆ పద్యాన్ని చదవండి వేదాంత విషయం తెలుస్తుంది.

"మాయను చెరసాల  మనసును  గొలుసౌను భేదమనెడు బండ బెరసి యుండు యింటి బద్ధ జీవి కెన్నడు మోక్షంబు..."


కామెంట్‌లు