మన గన్నవరం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 మా వేమన రెడ్డి అన్నయ్య కుమారుడు  శ్రీనివాస్ -శ్రీధర్  పెద్దబ్బాయిని ఇంజనీరుగా చిన్న అబ్బాయిని వైద్యునిగా తయారు చేశాడు  జీవితంలో ఆస్తులు కాదు కావలసింది చదువులు అనే వ్యక్తి మా అన్నయ్య  దానిని  కార్యరూపంలో చూయించినవాడు  పెద్దవాడు శ్రీనివాసరెడ్డి  తన కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ  తాను సంపాదించిన దానిలో కొంత  నిజమైన బాధలకు గురి అవుతున్న వ్యక్తులను చూసి వారికి  సహకరిస్తూ ఉండడం  తన ధర్మంగా పాటిస్తుంటాడు.  చిన్నవాడు శ్రీధర్ ఎంబిబిఎస్ చదవాలన్న  పట్టుదలతో  మంచి మార్కులను సంపాదించుకునే  తత్వాన్ని పెంచుకొని  చివరకు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి సలహా మేర ఇవాళ విజయవాడలో ఎంబిబిఎస్ లు ప్రతి వాడలోనూ ఉన్నారు  పంటి వైద్యుడు చైనా అతను ఒక్కడే ఉన్నాడు కనుక  ఆ శాఖను తీసుకోమని సలహా ఇస్తే  అదే చేశాడు  శ్రీధర్.
చిన్నతనం నుంచి చదువులో చాలా చురుగ్గా ఉండేవాడు  తండ్రి పోలికలు చాలా వచ్చినాయి తాను పట్టా పుచ్చుకున్న తర్వాత  విజయవాడలోనే ఆసుపత్రిని ప్రారంభించి  ఎవరి సలహాతో  తాను డాక్టర్ అయ్యాడో ఆ వ్యక్తి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారిని పిలిచి  తన ఆసుపత్రి ప్రారంభోత్సవ  కార్యక్రమం ఆయన చేతుల మీదగా చేయించారు  కృతజ్ఞత చూపడం  ఆ రక్తంలోనే ఉంది  తాను వైద్య వృత్తిని ప్రారంభించిన రోజు నుంచి 100 మంది  రోగులు వస్తే దానిలో  ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారు ఎవరు ఉన్నారో  వారిని  గమనించి  అలాంటి వారిని 20 మందిని  ఎన్నిక చేసుకొని వారికి ఉచిత వైద్యం అందిస్తున్నాడు  దానితో వారు ఆనందించడంతోపాటు తను  తండ్రి ఆశయాలకు ఆదర్శంగా నిలిచాను అన్న తృప్తితో  మరికొంత దాతృత్వాన్ని  పెంచుకోవడానికి అవకాశాలు వచ్చాయి. నెలకు ఒకసారి  ఉచిత వైద్య శిబిరాలను  ఏర్పాటు చేసి  ప్రతి వారిని  పరీక్షించి ఉచితంగా మందులు కూడా ఇవ్వడం  ద్వారా అనేకమంది  తమ పళ్లకు  చికిత్స చేయించుకోవడానికి ముందుకు వస్తున్నారు  తాను ఏ వృత్తిని చేపట్టాడో దానిపైమనసును లగ్నం చేసి  వైద్య వృత్తిని కొనసాగించడం వల్ల  తనకు పేరు రావడమే కాదు  ఆ వృత్తికి కూడా ప్రత్యేకతను తెచ్చిన వాడయ్యాడు  తాను చేస్తున్న కార్యక్రమాలను గమనించి  రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ గారి దగ్గర నుంచి  భారతదేశ ప్రథమ పౌరులు  ద్రౌపది ముర్మి గారి వరకు  అనేక బహుమతులను అభినందనలను  పొందటం మా కుటుంబ సభ్యులందరికీ  ఆనందాన్ని పంచింది  ఆరుమళ్ళ వారు అంటేనే అంకితభావంతో చేసేవారు  సమాజానికి ఉపయోగపడే పనులు చేసేవారు అని తను కూడా  రుజువు చేశాడు నాల్గోవ తరం వాడు. తర్వాతి తరం కూడా అలాగే ఉంటుంది 
రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో  రక్త సేకరణలో  ముందుండి పనిచేస్తున్న వ్యక్తి  మా చిన్ని  (అది మేం పిలిచే పేరు) శ్రీధర్ ముందుంటాడు అనేకమంది కి జీవం పోసిన వాడు.మా కోడలు రాధిక చేదోడు వాదోడుగా ఉండడం తనకి కలిసివచ్చిన అదృష్టం.

కామెంట్‌లు