మన గన్నవరం ;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 మా స్కూలుకి ఎదురుగా ఉన్న మంచినీళ్ళ చెరువు గట్టుమీద క్యారియర్లు విప్పుకుని భోజనం చేసే సమయంలో  మేమందరం  కబుర్లు చెప్పుకుంటూ తింటున్నప్పుడు  వచ్చే కాకులకు ఊర కుక్కలకు  స్కూలు ఉన్నప్పుడు రోజూ మధ్యాహ్నం విందు  విద్యార్థులందరూ వారి వారి క్యారియర్లలో నుంచి ఒక్కొక్క ముద్ద వేస్తూ ఉంటే వాటికి పండగ నరుడా భాస్కరుడా అని వ్రాసిన రచయిత సత్యమూర్తి కేజీ మా అందరికీ ఎంతో ఆప్తుడు వేమన గ్రంథాలయం రూపుదిద్దుకుంటున్న నా వయసుకు మనసుకు భావాలకు ఒక పుష్టిని పెంచిన మరో అమ్మ  అని  కృతజ్ఞతలు చెప్పేవాడు. సత్యమూర్తి  ఒక ప్రత్యేక వ్యక్తి  అనడం కన్నా  మంచి నాయకుడు అనడం ధర్మం  అతని తండ్రి మాకు ఉపాధ్యాయుడిగా ఉంటూ  క్రమశిక్షణ అంటే ఏమిటో మాకు తెలియజేసేవాడు  ఆయన ఏదైనా చెప్పవలసి వస్తే ఐ విల్ కిల్ యు  అనేవారు మమ్మల్ని ఎలా చూసేవారో సత్యమూర్తిని అతని సోదరి  మంజులను కూడా  అంత క్రమశిక్షణతో పెంచారు  మంజుల కాకినాడలోనే లెక్చరర్ గా  స్త్రీల కళాశాలలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసింది  కాకినాడలోనే స్థిరపడింది  అప్పుడప్పుడు తేలప్రోలు వచ్చి మా అందరితో కాలక్షేపం చేసి వెళ్ళేది స్నేహానికి ప్రాణమిచ్చే గుణం  అలాంటి కుటుంబంలో నుంచి వచ్చిన వాడు సత్యమూర్తి  తర్వాతి కాలంలో  కొండపల్లి సీతారామయ్య గారితో కలిసి ఉద్యమాన్ని ప్రారంభించాడు.
తర్వాత హైదరాబాద్ వెళ్లి  మరో అభిమన్యు  అన్న పత్రిక ప్రారంభించారు మా ఆనంద్ శిష్యులు  పైడి శ్రీ ఆ కార్యక్రమాలను చూస్తూ ఉండేవారు. ఆ పత్రికకు నేను కూడా కొన్ని వ్యాసాలు పంపించాను  వారు ప్రచురించారు కూడా  విశాఖపట్నంలో ఆయన సమావేశం ఏర్పాటు చేసినప్పుడు మంజుల  ఆనంద్  తదితరులు కూడా హాజరయ్యారు  తన జీవిత ఆశయం  ప్రజల శ్రేయస్సు కోసం తాను చేయదలచుకున్న పనులను గురించి  ఆరోజు చక్కగా ఉపన్యసించారు  నేను ఆనంద్ అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానాలు  చెప్పారు  మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా చూస్తూ  చివరి క్షణం వరకు  మా యోగక్షేమాలను  కనిపెట్టుకునే ఉన్నారు  అలాంటి మంచి స్నేహితుడు కవి, నాటక కర్త  మా సత్యమూర్తి.

కామెంట్‌లు