చందమామ రావే....;- డా.టి.రాధాకృష్ణమాచార్యులు 9849305871
చందమామ రావే
జాబిల్లి రావే పాటై పిలిచాం ఇన్నాళ్ళు 
ఇక చందమామ పావే 
జాబిల్లి పావే ఇకపై నడిచే పాట

నా మారాము తగ్గించ పాడింది అమ్మ
బువ్వ తినని నాకై చందమామ రావే పాట తెచ్చే
అది చందమామ,బాలమిత్ర కథనో 
బాలల సాహిత్య సృజన కల్పనో మరి
రాలేదని తెలిసినా చేర రమ్మని పిలిచే
అదప్పుడెంతో అందమైన తీపి పలుకు

ఇప్పుడో మరింకా 
జాబిల్లి రాదని తెలిసే
చంద్రయాన్3 రథము నీకై వచ్చే
నీకు ముద్దులిచ్చే అమ్మవీ నావీ 
నిన్ను ముద్దాడే ఆత్మీయ మనసుతో

చంద్రుని దక్షిణ ధృవంపై కాలుపెట్టే 
నీ మర్మం నీ గుట్టూ ఛేదించ
నీతోనే నేనుండే ఎంత వీలున్నదో 
శోధించే కనిపెట్టగ చంద్రయాన్3 మిషన్
కొనసాగించేను 
ధరణి మట్టే చంద్రుడు మట్టి గుంతలే 
ప్రజ్ఞాన్ లాండర్ తీసిన ఫోటోలు చెప్పే
చందమామ అందిన రోజు సంతోషం
కొనసాగేను జాబిలి నివాసమై నాలో

చంద్రయాన్3 విజయం
భారత ప్రజల అఖండ విజయం
ఇస్రో శాస్త్రవేత్తల సమిష్టి కృషి 
ఫలితమై చెమట చుక్కలు నేలను చిందిచెగా 
విజయ గరిమ రెపరెపలాడే
మువ్వన్నెల పతాక చంద్రునిపై ఎగుర 

జయహో!జయ జయహో!!
చంద్రయాన్3 ఘన విజయమహో 
ననుగన్న నా దేశ ప్రజా గర్వకారణం
జాబిలితో ఆటలాడు రోజు కోసం 
మట్టిమనసు ఆరాటం నాదైన కొత్తకొత్త ఆశగా...


కామెంట్‌లు