స్వాగతం
అంటూ ఆహ్వానిస్తోంది
పోటీ ప్రపంచం
ఆట పోటీ
పాట పోటీ
చదువు పోటీ
ప్రతిభ కి పోటీ
బ్రతుకు ఒక
పందెం పోటీ
చివరికి మనిషికి
మేషీను పోటీ
ఎన్ని పోటీలైనా
బ్రతుకు విలువకు
సాటి రావు
జీవితానికి
పోటీ ఒక సవాలు
ఆ సవాలుని
స్ఫూర్తి తో స్వీకరిస్తే
బ్రతుకు బాట
సరళం
గెలుపు తలపు
వదిలేద్దాం
పోటీ పరుగు
సాగిద్దాం
ఇదే ఈ నాటి
జీవితం అని
బ్రతుకు విలువని
తెలుసుకుందాం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి