విశ్వ భారత్; వెంకట రమణారావు -9866186864
స్వేచ్ఛా సమీరం కోసం
భారతీయుల సమరం
ఆ సేతు హిమాచల పర్యంతం
నినదించిన మహొద్యమ గళం


వేష భాషలలో వైవిధ్యం
భారత దేశపు వైశిష్ట్యం
ఏ మతమైనా ఏ రాష్ట్రమైనా
అందరూ స్వతంత్ర భారతీయులే

దశాబ్దాల స్వాతంత్య్రం
పునాదుల నుంచి
అంతరిక్షం వరకు 
దశ దిశలా అభివృద్ధికి
ప్రగతి బాట పరిచింది
మువ్వనెల పతాకం
మెరిసింది విశ్వమంతా

స్వతంత్ర భారతం
నవ భారతం
వన్నెలు చిందే
యువ భారతం
 ఈ విశ్వ భారతం

కామెంట్‌లు