⚜️ అల అంతరిక్ష మందు
భారతీయ శోభాయాత్ర
చంద్రయాన్ విజయ యాత్ర
ఓ సుమతీ! ఓజోవతి!
⚜️అందమైన చందమామ
అందరికీ మేనమామ
ఆత్మ బంధువు మనకు!
ఓ సుమతీ! ఓజోవతి!
(అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ.,)
👌చంద్రుడు.. సప్త దినాధిపతులలో.. రెండవ వాడు! కాలమానంలో.. చాంద్రమానం ఒకటి! ఇది.. భూమండలం నందు.. చంద్రుని వృద్ధి క్షయముల ననుసరించి; తిథులు, వారములు, పక్షములు, మాసములు.. లెక్కిస్తారు, ఖగోళ శాస్త్రజ్ఞులు!
స్థావర జంగమాత్మక మైన, ప్రకృతి కంతకు.. చల్లని వెన్నెలను కలిగించు చున్నాడు.. చంద మామ! అందువలన, అందరికీ మేనమామ యైనాడు!
👌 ఆ చంద్రుఁడు.. మన భారతీయ చంద్రయాన్ యాత్రకు.. మురిసి పోయాడు! ఎంతగానో ఎదురు చూస్తూ; ఆహ్వానం పలికి, మన పతాక ప్రతిష్ఠతో పులకించి పోయాడు. తత్ఫలితముగా చంద్రయాన్ శోభా యాత్ర.. విజయవంతంగా జరిగింది! చంద్రమండలముపై మనపతాకమును ప్రతిష్టించారు, మన శాస్త్రజ్ఞులు!
ఇది అంతా.. ఆ జగన్మాత అయిన శ్రీమాత దయవలన మాత్రమే మనకు లభించినది. ఆ తల్లికి పాదాభివందనములు సమర్పించు చున్నాము! మన చంద్రయాన్ విజ్ఞానవేత్త లందరికీ హృదయపూర్వక అభినందనలు తెలుపుకొను చున్నాము! 💐💐💐
🚩 శార్దూలం పద్యం
శ్రీమన్మంగళ చంద్రుఁ డాతురతతో చేసాచి రమ్మంచు, నే
మామన్ మీకని యాదరింపగ, నటన్ మా భారతీయప్రభల్
వ్యోమంబందున వెల్గ కేతనము భావోద్దీప్తితోఁ జేరె, నో
శ్రీమాతా! భరతావని ప్రభలనే ప్రీతిన్ గృపన్ బెంచితే?🙏
( "చిత్ర కవితా సమ్రాట్" చింతా రామకృష్ణారావు.,)
🔆🪷🔆
🚩ఉత్పల మాల పద్యం
సొమ్ములు ఖర్చు లేనిదది చూడుడు చంద్రుని యాన ల్యాండరున్
రమ్మని పిల్చు చందురుని రాగసుధామయ దీప్తులం తగన్
బమ్మిని తిమ్మిచేయగల ప్రాజ్ఞులు ఇస్రొ మహాత్ము లెన్ను యా
నమ్ము జయమ్ము గాంచుత వినమ్రత చంద్రు గ్రహమ్ము కల్మితో!
( డా.శాస్త్రుల రఘుపతి., )
🔱జై హింద్! జై భారత్!🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి