పక్షుల పాఠాలు;- -'బాలబంధు' గద్వాల సోమన్న,9966414580.
కోకిలమ్మ గొంతు చూసి
వీనులవిందు చేసుకో
నెమలమ్మ సొగసు చూసి
ఇక కనువిందు చేసుకో!

కాకమ్మ అరుపు చూసి
మాటలను సరిచేసుకో!
చిలుకమ్మ పలుకు చూసి
మాట విలువ తెలుసుకో!

కోడిపుంజు కూత చూసి
చురుకుదనం పెంచుకో!
పాలపిట్ట తనువు చూసి
పాఠాలను నేర్చుకో!

పావురం ధారణ చూసి
మెదడుకు పదును పెట్టుకో!
పక్షులు నేర్పు పాఠాలు
శ్రద్ధగా విని దిద్దుకో!
 


కామెంట్‌లు