గిడుగు వాడుక భాష తొలి అడుగు;- -'బాలబంధు' గద్వాల సోమన్న,9966414580.
వ్యావహారిక భాష 
అమలుకు తొలి అడుగు
ఘన పోరాట యోధుడు
మన రామమూర్తి గిడుగు

తెలుగు వాడుక భాష
ఉద్యమ పితామహుడు
సార్ధక నామధేయుడు
రామమూర్తి ఘటికుడు

వ్యావహారిక తెలుగు
భాషోద్యమానికతడు
కదా మూలపురుషుడు 
గిడుగు చిచ్చర పిడుగు

చరిత్ర సృష్టించిన
మగధీరుడు మహిలో
గిడుగు రామమూర్తిని
కొలవాలోయ్! మదిలో


కామెంట్‌లు