ఆత్మవిశ్వాసమే ఆయుధం;--'బాలబంధు' గద్వాల సోమన్న,-9966414580.
ఆకాశమే హద్దుగా
భూలోకమే ముద్దుగా
చేయాలోయ్! సాహసం
సజ్జనుల సహవాసం

ఆపదలో అండగా
నిలవాలోయ్! కొండగా
చిందాలోయ్! దరహాసం
రావాలోయ్! మధుమాసం

మాటలే  సత్యాలుగా
మమతలే ముత్యాలుగా
కురియాలోయ్! చినుకులై
విరియాలోయ్! సుమములై

వెలుగులీను దివ్వెగా
విహరించే గువ్వగా
ఉండాలోయ్! జగతిలో
నడవాలోయ్! ప్రగతిలో


కామెంట్‌లు