రామాపురం అనే ఊరిలో రాధా అనే ఒక మధ్యతగతి ఒంటరి మహిళ నివసించేది.తనకు ఇద్దరు పిల్లలు సీత, గీత.తను రోజు పనిచేయగా వచ్చిన డబ్బులతో ఇద్దరు పిల్లలను చదివించలేకపోతోంది.సెలవు రోజులలో పిల్లలను కూడా పనికి తీసుకు వెళ్ళేది.ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉండేది. పెద్దదైన సీతకు ఈ విషయం అర్థమవుతుంది.అప్పుడు సీత ఎలాగైనా వాళ్ళ అమ్మకు సహాయం చేయాలనుకుంటుంది.10వ.తరగతి తర్వాత చదువు ఆపేస్తుంది.
వాళ్ళమ్మతో రోజు పనికి వెళుతుంది.
కానీ చిన్నదైన గీతకు బాగా చదువుకోవాలని ఉండేది.ఈ విషయం అమ్మకి చెప్తుంది. నాకు పనికి వెళ్లాలని లేదు. చదువుకోవాలని ఉంది.గీత వాళ్ళ అమ్మతో మాట్లాడడం సీత వింటుంది ఎలాగైనా చెల్లిని బాగా చదివించాలని అనుకుంటుంది.కష్టపడి కుట్టుమిషన్ నేర్చుకుంటుంది.వాళ్ళ అమ్మతో పాటు ఇతర పనూలు చేస్తూ గీత ఖర్చులు అన్నింటిని భరిస్తుంది.ఒకరోజు గీత స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నప్పుడు ఒక అమ్మాయి ఇలా అంటుంది. గీత చాలా పేద అమ్మాయి. తనకు మంచి బట్టలు కూడా లేవు.అలాగే ప్రతిరోజు సద్దన్నం తెచ్చుకుంటుంది. తనతో మనం స్నేహం చేయకూడదని అంటుంది.ఆ మాటలకు గీత చాలా బాధపడుతుంది.సాయంత్రం ఇంటికి వెళ్లిన తర్వాత వాళ్ళ అమ్మతో చెప్తుంది.ఈ మాటలను సీత వింటుంది. చెల్లి బాధను అర్థం చేసుకొని,తనకు చదువు గొప్పదనం గురించి చెప్తుంది.బాగా ప్రోత్సహిస్తుంది.ధైర్యం చెపుతుంది.అక్క చెప్పిన మాటలతో గీతకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.ఇకనుండి ఎవరు ఏమి అనుకున్నా నేను బాధ పడను అని బడికి వెళుతుంది.చక్కగా చదువుకుంటుంది.మంచి మార్కులు తెచ్చుకుంటుంది. చదువు పూర్తి అయిన తర్వాత గీతకు మంచి ఉద్యోగం వస్తుంది.రాధకు వివాహం జరుగుతుంది.
ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు చేస్తూ ధైర్యంగా బతుకుతుంది.గీత వాళ్ళ అమ్మను మంచిగా చూసుకుంటుంది. వాళ్ళందరూ సంతోషంగా జీవితాన్ని గడుపుతారు.రాధ ఇద్దరు కూతుర్లు జీవితంలో స్థిరపడడంతో చాలా సంతోష పడుతుంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి