అమ్మే కదా తొలి గురువు ;- కవి శిరోమణి గాజుల నరసింహ
మణిపూసలు
---------------
ఆది గురువు అమ్మ కదా
తొలి పలుకుల అమ్మ కదా
నేర్పుతుందిగా జ్ఞానము
జ్ఞాన దేవత తను కదా  

ఆలన లాలన పాలన
అమ్మకదా  ఆది లోన
సృష్టి మొదలు చెబుతుందిగ
అమ్మ చరితలె ఇలలోన  

ముద్దు ముద్దు మాటలతో
తీపి తీపి పలుకులతో
రంగరించి పెడుతుందిలె
అన్నపు ముద్ద ప్రేమతో.. 

అలక పడక పట్టు పలక
దిగులు పడక చిట్టి మొలక
అక్షరాలు దిద్ధుకుంటె
బాగు పడతావే చిలక...

అమ్మ వుంది తోడు నీకు
ఎపుడు నువ్వు బెంగ పడకు
చెయ్యి పట్టి నేర్పుతుంది
దిద్దుకో గోము చెయ్యకు..

అమ్మ అంటె బొమ్మ కాదు
బయట దొరికె సరుకు కాదు
సరిచేసుకొ ఇపుడే నీ
అడుగు సమయం మరి రాదు 

తరులు విరులు పులకరించు 
గిరులు మణులు పరవశించు
అమ్మ స్పర్శలోన చూడు 
నువ్వు  కంటగ  తిలకించు 

అమ్మ కథ చెప్పిన
అమ్మ పాట పాడిన
పండు కన్న తియ్యన
మంచు కన్న చల్లన 

మమకారమే లాలిగా
అనురాగమే ముద్దుగా
కలిపి పెడుతుంది చూడిక
ఆప్యాయతనె ముద్దగా..

అమ్మ  జ్యోతి వెలుగు కదా
అమ్మ దేవి అంశ కదా
అర్థం చేసుకొని చదువు 
చదువు విలువ వుంది కదా  


గాజుల నరసింహ
9177071129

కామెంట్‌లు