అవ్వయ్య మాటలు
ఆత్మీయ భావాలు
ఇంతా అంతా కాదు
ఈశ్వరుని కృపంతా!
ఉయ్యాలలో పాపాయి
ఊ కొట్టుతూ ఆడగా
రుక్కమ్మత్త చూసింది
రూపాయి తెచ్చి ఇచ్చింది!
లుంగి తాత వచ్చాడు
లూజు చొక్క తొడిగాడు!
ఎంకమ్మత్త వచ్చింది
ఏమేమో తెచ్చింది
ఐదు పైసలకిచ్చింది!
ఒక అక్కా వచ్చింది
ఓర్పుతో చూసింది
ఔషధమని చెప్పింది!
అందరూ వచ్చి చూశారు
ఆః ఓహో అంటూ నవ్వారు!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి