ఊహలు ఊరిస్తుంది
తలపులు తడుతుంది
ఆలోచనలు పారిస్తుంది
భావాలు బయటపెట్టిస్తుంది
మనసును మురిపిస్తుంది
హృదయాన్ని కరిగిస్తుంది
అంతరంగాన్ని అలరిస్తుంది
తనువును తృప్తిపరుస్తుంది
తినిపిస్తుంది
త్రాగిస్తుంది
నిద్రపుచ్చుతుంది
మేల్కొపుతుంది
గుబులుపుట్టిస్తుంది
ప్రేమకలిగిస్తుంది
కష్టముచేయిస్తుంది
కుతూహలపరుస్తుంది
తెలివిని ఇస్తుంది
కోర్కెలు లేపుతుంది
పనులు చేయిస్తుంది
ఫలాలు అందిస్తుంది
తలకు ఎక్కుతుంది
ఉన్నతస్థానం ఆక్రమిస్తుంది
ఎముకలమధ్య కూర్చుంటుంది
రక్షణస్థావరం ఏర్పరచుకుంటుంది
పెదవులను పలికిస్తుంది
శబ్దాలను వినిపిస్తుంది
శ్రమను చేయిస్తుంది
ముందుకు నడిపిస్తుంది
నువ్వు ఏమిటో
నీమెదడు చెబుతుంది
నీసంపాదన ఏమిటో
నీమెదడు నిర్ణయిస్తుంది
నీ చేతలేమిటో
నీమెదడు సూచిస్తుంది
నీ రాతలేమిటో
నీమెదడు తెలుపుతుంది
ముందంజకు
మెదడే మూలము
మనుగడకు
మెదడే ముఖ్యము
మెదడును
వశపరచుకో
మనసును
అదుపులోపెట్టుకో
రహస్యం
తెలుసుకో
జీవితం
గడుపుకో
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి