శబ్ద సంస్కృతి ! అచ్యుతుని రాజ్యశ్రీ
 మూర్ఛనా అంటే హిందీ లో హిందీ లో మూర్ఛపోవటం.సంగీతంలో ఏదైనా స్వరంతో ఆరంభంచేసి 7వస్వరందాకా ఆరోహణ అవరోహణ తో ఆలాపన చేయటం.కిందస్థాయి సనుంచి మొదలుపెట్టి పైన ని దాకా ఆలాపన చేయడంతో శ్రోతలు మూర్ఛావస్థలోకి పోతారు.అంత ఆత్మానందం అనుభవిస్తారు అన్నమాట.ఇలా రెండు అర్థాలు ఉన్నాయి.
మేదిని అంటే అర్థం పృథ్వి.పురాణాలప్రకారం మధుకైటభులు మేదలో ఉత్పన్నమయ్యారు కాబట్టి భూమి ని మేదిని అన్నారు.వాయుపురాణం ప్రకారం ఇందులో 7ద్వీపాలున్నాయి.
మెహతర్ అంటే శ్రేష్ఠమైన ప్రతిష్ట ఉన్న వ్యక్తి.కానీ హిందీ లో భంగీ సఫాయి కర్మచారి అని అర్థం.పరిశుభ్రంగా వారు రోడ్లు మురికి ప్రాంతాల్లో పనిచేసి పర్యావరణంని కాపాడుతున్నారు.అందుకే వారిని మనం గౌరవించాలి.నాసిక్ జిల్లా లోని భిల్లుల పెద్ద మెహతర్ అంటారు.పూనాలో వడ్రంగంపనివారినికూడా మెహతర్ అంటారు.గుజరాతీలో మెహతా బీహార్లో మహతో కూడా ఇదే అర్థం లో వాడుతున్నారు.మహతో అంటే గ్రామ పెద్ద 🌷

కామెంట్‌లు