పాండవులు ధృతరాష్ట్రుని క్షమాపణ అడగాలని పెదనాన్న దగ్గరికి వెళితే ఎవరూ వద్దు ఒక్క భీముడిని పంపించండి నేను ఆలింగనం చేసుకుంటాను అని చెప్పి వారిని అడుగుతాడు. అప్పుడు భీముడు వెళ్ళబోతుంటే కృష్ణుడు , భీముడిని ఆపి, ఉక్కు విగ్రహాన్ని పంపుతాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు తనపుత్రులను చంపాడనే కోపంతో ఆ ఉక్కు విగ్రహాన్ని భీముడు అనుకొని కోపంతో కసితో బలంగా కౌగిలించుకునేసరికి అది పిండి పిండి నుజ్జు నుజ్జు అయిపోయింది. అది చూసి అందరూ ఆశ్చర్య పోయారు.
అప్పుడు ధృతరాష్ట్రుడు నిజంగా జరిగిందని
బాధపడతాడు. కృష్ణుడు అతనిని అనునయిస్తూ
నీలో ఉండే అహంకారం కోపం కసి నాశనం అయిపోయాయి. భీముడు మరణించలేదు. ఇప్పుడు మీరు మంచి హృదయంతో పాండవులను క్షమించి భీముడిని ఆలింగను చేసుకోండి అని చెబుతాడు.
తనని తాను తెలుసుకున్న ధృతరాష్ట్రుడు భీముడిని. పాండవులను. క్షమిస్తాడు ఆశీర్వదిస్తాడు.మనషికి కోపం, కసి ,పగ అసహ్యం
ఇలాంటి అవగుణాలు కూడదు, అవీ జీవిత గమనాన్ని చెరుస్తాయి..
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి