వేల వసంతాలు పరిమళించినట్లుగా
శరత్ జ్యోత్స్న చినుకై వర్షించినట్లుగా
పెదాలపై దరహాసం శాశ్వతమై నిలిచినట్లుగా
యెదలోతుల్లో ఏదో ఆనందం పుట్టినట్లుగా
అంతరాంతరాలలో ఆత్మీయత గుర్తుండిపోయేలా
దేహాలు వేరైనా ఆత్మలు ఒక్కటైనట్లుగా
ఏకగర్భజనితులై అభిమానం అంబరాన్ని తాకినట్లుగా
క్షీరాబ్ధిలో జన్మించిన లక్ష్మీ చంద్రుల అనుబంధానికి దీటుగా
అక్కా తమ్ముళ్ళ మధ్య అనురాగం
ప్రభవించాలనీ , నించాలనీ, మించాలనీ, అనుగమించాలనీ
ఈ రాఖీబంధనం మన జన్మజన్మల బంధమవ్వాలనీ కోరుకుందాం!!
—--------------------------------------
.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి