నీ గురించి ఆలోచించు;- అనువాదం: రాఘవ శర్మ
ఇక్కడే ముగుస్తుంది 
 నీ పొగరుబోతుతనమంతా,
పద్ధెనిమిది నుంచి ఎనభయ్ వరకు 
ఉదయం నుంచి రాత్రి వరకు 
సోమ నుంచి ఆదివారం  వరకు 
జనవరి నుంచి డిసెంబర్ వరకు 

ఇక్కడే ముగుస్తుంది
దుష్ట పన్నాగాల చర్మం 
ప్రతి మనిషి నుంచి తిప్పేసుకొనే   
చంద్ర బింబం  లాంటి  నీ ముఖం 
 అందమైన దుస్తులు 
 మిలమిల మెరిసే నీ చర్మ సౌందర్యం 

ఇక్కడే ముగు స్థాయి 
నీ విదేశీ కార్లు 
 మేధస్సు 
 డిగ్రీలు 
అందమైన భార్య 
చక్కని పిల్లలు 

మిత్రమా ..
అవన్నీ ఇక్కడే ముగుస్థాయి 
నీవు అమితంగా కోరుకునే కీర్తి ప్రతిష్టలు 
విలాస వంత మైన జీవితం 
అవన్నీ " నా సంపద పయిన ఆధార పడినవి"
" నే నెవ రో తెలుసా?"

 అది ఇక్కడే ముగుస్తుంది
  "నీవు  నాకు సమానం కాదు ?
నేను నీ కంటే ధనికుడిని
నేను చాలా అందగాడిని 
చాలా మంది అబ్బాయిలు నన్ను ఇష్టపడతారు 
నన్ను పొందాలని చాలామంది అమ్మాయిలు 
 కొట్లాడు కుంటారు"

అంతా ఇక్కడే ముగుస్తుంది 
నువ్వు రాసిన మంచి కవిత్వం 
నీ గణిత మేధస్సు 
నీ ఆంగ్ల భాషా పరిజ్ఞానం 
 ఇంకా నీ చుట్టూ ఉన్న అత్యుత్తమమైనవి 

ఇదంతా కాసేపటిలోనే 
కానీ అది తప్పదు 
అంగీకరించడానికి బాధ పడ్డా,
ఇది చేదు నిజం 
నీ కోసం అరడుగులు ఎదురు చూస్తోంది 
అన్నీ అక్కడే ముగిసిపోతాయి 

కాబట్టి 
నీకంటూ ఏమీ లేదు 
ఎవరి కంటే కూడా నీవు ఎక్కువ కాదు 
అధికుడ నని అనుకోవడం ఆపేయి
అన్నీ గాలిలో కలిసి పోతాయి 

హుందా గా ఉండు 
దుమ్ము నుంచి దుమ్ము వరకు 
======================================
(మూల రచయిత/ కవి/ కవయిత్రి ఎవరో తెలియదు)

కామెంట్‌లు