ఇప్పుడు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద క్రిస్టియన్ చర్చి అయినా సెయింట్ పీటర్ వారి మహా క్రైస్తవ ఆలయము రోమన్ కాదోలిక్ మతానికి కేంద్రంగా ఈ మతానికి అత్యంత ముఖ్యమైన సంరక్షక కేంద్రంగా చెప్పవచ్చు. యూరోప్ ఖండంలోనే ఎక్కువమంది సందర్శించే యాత్రా స్థలంగా ఇది వెలుగు అందుతుంది.
క్రీస్తు శకం 324 వ సంవత్సరంలో కాన్ స్టాన్ టిన్ ద గ్రేట్ అనే చక్రవర్తి అపోస్తలు సైమన్ పీటర్ సమాధి స్థలంగా వాటికన్ ఏర్పాటు చేశాడు.
క్రీస్తు శకం 1547వ సంవత్సరంలో పోపు పాల్ 3 ఈ చర్చిని నిర్మాణ బాధ్యతను 72 ఏళ్లవృద్ధుడైన ప్రపంచ ప్రసిద్ధి చిత్రకారుడు మైకేల్ ఎంజేలోకు అప్పజెప్పాడు. మహా కోపిష్టి అయినా మైఖేల్ ఏంజెల్ కి అప్ప చెప్పాడని అనడం కంటే ఆజ్ఞాపించాడని అనడం సబబు.
క్రీస్తు శకం 1623వ సంవత్సరము నవంబర్ 18న ఈ చర్చి నిర్మాణం పూర్తి కాగా కోపం 4 లాంఛనంగా ఈ చర్చిని దైవాంకితం చేశాడు. ఎంతో అపురూపమైన ఈ బాసిలికా నిర్మాణం 120 సంవత్సరాల పాటు కొనసాగింది. మహాశిఖర గుమ్మటానికి ఉన్న నాలుగు స్తంభాలలో ప్రతిస్తంభం లో ఉన్న ఒక్కో పరిశుద్ధుని సెయింట్ పాలరాతి విగ్రహం 10 అడుగుల ఎత్తైనది ప్రతిష్ట చేయ పడింది. 1964 సంవత్సరంలో గ్రీసులో ఏ ప్రాంతంలో యాండ్రూ పుర్రె కనుగొనబడ్డది మళ్లీ అక్కడికే అది పంపి వేయబడింది. ఈ మహాలయ శిఖర గుమ్మటం మీద ఉన్న దీపం చేరుకోవటానికి 537 మెట్లు నిర్మించబడ్డాయి. ఒక లాటిన్ శాసనం కూడా పొందుపరచబడింది."నువ్వు పీటర్ వి ఒక శిలవి ఈ రాతి మీద నేను నా చర్చిని నిర్మిస్తాను నువ్వు స్వర్గం (దేవుడి సన్నిదానికి) చేరుకోవడానికి నేను నీకు ద్వారం తెరుస్తాను నీకు మార్గం చూపిస్తాను. అనేది ఆ శాసన విషయం.
ఈ మహా ఆలయంలోని చుట్టూ గోడలు ఒక చెక్క కుర్చీని కప్పుతో శిలా ప్రార్ధన మందిరం పిలువబడే ఒక కాంస్య దైవపీఠ భాగం అమర్చబడి ఉంది. కన్యా మేరీ వస్త్రపు నడుము పట్టి మీద మైకేల్ ఏంజిలో బ్యూనారొటి ఫ్లోరిన్ టైన్ నివాసి దీన్ని రూపుదిద్దాడు అనే అర్ధాన్ని వచ్చేటట్టుగా లాటిన్ లో సంతకం చేశాడు. మహా ఆలయంలో ఉన్న రంగు చిత్రాలతో పాటు ఇంకా ఎన్నో చిత్రకళ నిధులు కూడా వాటికన్ మ్యూజియంలో పదిలంగా ఉన్నాయి. అన్నిటిలోకి అద్భుతమైన కళాఖండం ఈ మహా క్రైస్తవ ఆలయంలో ఉన్న అతి గొప్ప పరిసర ప్రదేశాలలో ఈ పెయింటింగ్స్ ను చూసినప్పుడు కలిగే అనుభూతి వాటికన్ మ్యూజియంలో చూసినప్పుడు కలుగదు.
శిఖర గోపురం పరిమాణం. ఈ శిఖర గోపురం కచ్చితంగా 138.8 అడుగులు శిఖర గోపురం కింద నుంచి పైన ఉన్న దీపం వరకు దీని ఎత్తు 140 అడుగులు.
సెయింట్ పీటర్ మహా క్రైస్తవ ఆలయము (ఇటలీ);- తాటి కోల పద్మావతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి