అమ్మంటే .....!!---శ్రీమతి సత్య గౌరి . మోగంటి

 అమ్మంటే......
ఎంత అద్భుతమో,
అంత ప్రేమ మయమే!
అమ్మా!నీ ధ్యానంలో 
నన్ను నేనే  మరచిపోయా!
నీ అపురూప ప్రేమానురాగంలో 
మనిషిన్నయ్య.!
నా మనసు  -
సూర్యుని చుట్టూ తిరిగే చంద్రనిలా
నీ చుట్టూ తిరుగుతోంది.!
చంద్రునికి సూర్యుడంటే అంటే ఇష్టం.
నాకు మా అమ్మ అంటేఇష్టం.!
ఆ దివ్య కాంతి వెలుగు నీడలు
నాపై పడటం ఎంత అదృష్టమో
మా అమ్మ ప్రేమ నాకు దక్కటం 
అంతే  అద్భుష్టం  కదా!
అమ్మ అనే పదంలోనే                     
ఆ మాయ, ఆ పారశ్యం ఉందేమో!
నన్ను పిలిచావే అమృతధార లొలికిస్తూ
కన్నా! .... అని.
వేవేల శృతులతో నను మీటావు.
నాలో నాట్యం చేసేది కూడా -                   
నీదివ్య మంగళ రూపమే నమ్మా!
నా ప్రతి ఆనంద భాష్పంలో ఉన్నది 
నీవేనమ్మా!
నా ఆశలచివురులలో
నీ ప్రేమే నిండి వుందమ్మా!
నా అంతరాత్మ లో అణువణువులో 
ఉన్నది నీవేనమ్మా!
నీ తియ తీయని పలకరింపుతో ...
అద్వితీయమైన ఆనందంతో....
అరమోడ్చిన కన్నులతో.....
అందమైన మనిషిగా 
తీర్చిదిద్దినది నీవేనమ్మా!
నీ త్యాగాల ఫలమేనమ్మా
నా ఉన్నతి,అభ్యున్నతి.....
నీ కలల రూపమేనేనమ్మా.....!
అమ్మా! నీకు శతకోటి వందనాలు.
నన్ను దీవించమ్మా..
నీవు లేని నా జీవితమే శూన్యం తల్లీ.!
నా బంగారుతల్లి,నాపాలిట కల్పవల్లి!!
                     ***

కామెంట్‌లు