లార్డ్ మెకాలే;- కొప్పరపు తాయారు

 భారతదేశానికి చాలా అన్యాయం చేశాడు తన అధికార దర్పంతో తప్పనిసరిగా భారతీయులకు ఆంధ్ర భాష నేర్పించాడు. నేర్పించడం తప్పు కాదు
           వేద పాఠశాలలు సంస్కృతి సంబంధమైన జ్ఞానాన్ని నేర్పించే విద్యాలయాలని దెబ్బ కొట్టాడు
          కారణం వారికి బానిసలు కావాలి అందుకు ఆంగ్ల విద్య నేర్పి వాళ్ళ భటులను చేస్తుకున్నారు.
తప్పనిసరిగా వారికి జీత బత్తాలు  ఏర్పాటు చేశారు దీనితో వారిని పూర్తిగా ఆకట్టుకోవచ్చు అని ఒక దృడ సంకల్పంతో చేశారు. ఇది దుర్మార్గపు చర్య.
తమ చెప్పు చేతలలో బంధించి బానిసల్ని చేసారు
                ఆ విధంగా మొత్తం భారతదేశం హానీ పొందిందనే చెప్పాలి. మన సంపదలు వేద శాస్త్రాలు దోచుకున్నారు. ఎందుకంటే అన్ని దేశాల కంటే మనదేశంలో శాస్త్రీయజ్ఞానం ఎక్కువ అందుకు ఆ గ్రంథాలని పట్టుకెళ్ళారు  అనేకంటే దొంగిలించారు అంటే బాగుంటుంది..
                మనం అందుకే ఇంకా ఆ బానిసత్వపు పొడలు ,ఛాయలు పోలేదన్నమాట అందుకే మనం మన పిల్లలకు తప్పుడు మాటలు చెప్పి అపశృతులు పలికిస్తున్నాం. ప్రతివారు మమ్మీ డాడీ అని పిలుస్తారు (కూస్తారు అంటే బాగుంటుంది)
మమ్మీ అంటే రక్షిత మృత కళేబరం
డాడీ అంటే అమ్మకి రెండవ భర్త (అపశృతి)
రెండు తప్పుడు మాటలతో ఇంట్లో పిల్లలతో సంభాషణ మొదలుపెట్టిస్తున్నాం ఎంత తప్పు
       మన సాంప్రదాయం ప్రకారం ఎప్పుడు మాట్లాడిన మంచి మాటలే మాట్లాడాలి అవి మన జీవితం బాగుపడ్డానికి బాట ఆ మాట మనకు మన పెద్దలు నేర్పించారు కానీ మనం కొత్త పోకడలు కోసం నేర్చుకున్న  వికృతపు మాటలు.
    సంస్కృతి సాంప్రదాయం నిలబెట్టుకోవడం మన ధర్మం.
కామెంట్‌లు