సమస్యాపూరణం ;- మచ్చ అనురాధ-సిద్దిపేట
 "పొలతుక కోసమై జరిగె బెబ్బులి యుద్ధము ప్రొద్దుటూరులో " 
=========================================
చంపకమాల 
వలచిరి కన్యనిద్దరును ‌వాసిని వింతగ దెబ్బలాడుచున్
విలవిల లాడుచున్ మదిన ‌వెర్రిగ వాగుచు నేనునేననిన్
కలతలు ‌జెంది‌యున్ యువతి ‌కై పలు మాటలు దిట్టుకొంచు నా    ‌
పొలతుక ‌కోసమై జరిగె ‌బొబ్బిలి యుద్ధము‌ ప్రొద్దుటూరులో‌

కామెంట్‌లు