మనల్ని కలిపేది!!;- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పిఎస్ నంది వడ్డేమాన్ నాగర్ కర్నూల్ జిల్లా.
మనుషులు
కులాలుగా మతాలుగా ధనిక బీద వర్గాలుగా స్త్రీ పురుషులుగా
కుడి ఎడమ పార్టీలుగా సిద్ధాంతాలుగా
ఆస్తికులుగా నాస్తికులుగా విడిపోయి ఉన్నారు.

వీరందరినీ కలిపేది
ప్రేమ అయితే స్త్రీ వలన

అధికారము ధనమైతే
ప్రభుత్వం వలన సాధ్యమవుతుందని అనుకున్నాం.!!

దేవుని వలన దేని వలన అది సాధ్యం కాదని రుజువైంది.!!?

కానీ మనుషులందరినీ కలిపేది
విజ్ఞానము విజ్ఞాన శాస్త్రము ఒక్కటే!!!


కామెంట్‌లు