దిద్దించు!వ్రాయించు!
దివ్యమైన తెలుగు లిపిని!
పలికించు!పాడించు!
నవ్యమైన తెలుగు ధృతిని!
ప్రేమించు!పాటించు!
తెలుగు భాష వాడుకని!
అందించు!అలరించు!
తెలుగు సాహితీ ఝరిని!
నటియించు!నడిపించు!
తెలుగు రంగస్థలమునీ!
రచియించు!రాణించు!
తెలుగు పద్యసౌరభాన్ని!
ఊహించు!ఉరికించు!
తెలుగు భాషలో వృద్ధిని!
రంజించు!రవళించు!
తెలుగుతల్లి పాటలనీ!
సాధించు!వెలిగించు!
తెలుగుజాతి గుర్తింపుని!
చాటించు!తరియించు!
తెలుగువాడిని నేననీ!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి