నీలాకాశపు దారుల్లో
పాలమబ్బు బారులు
నేల ముంగిట పూసిన
వేల పూల గుత్తులు
గగనంలో మబ్బుల
నిరీక్షణ దినకరుడికై
భువనంలో సుమాల
అమరిక పూమాలలై
వేగిరపడు హృదయాలకు
వేడుక తెచ్చే వేకువగా
సాగిలపడు కుసుమాలకు
సాక్షాత్కారించే దైవము
కొండ అంచున నిండుగా
కోటికిరణాల ప్రభలుగా
కొత్త వెలుగులు చిందగా
కోహినూరై మెరిసె శుభకరముగా
కలవరములు పోద్రోలి
కలలన్నీ వరములుగ ఇచ్చు
కనులముందు తోచు
కమనీయ రూపము
నింగీ నేలా కలిసే చోట
కనులూ కళలూ విరిసేబాట
గిరులూ తరులూ మెరిసే పూట
మనసా వాచా కోరే మాట
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి