నందస్వామి ఆశ్రమంలో చాలామంది విద్యార్థులు వివిధ శాస్త్రాలు అభ్యసించి నిష్క్రమిస్తుంటారు. కానీజ్ఞాపకశక్తి కొరత వల్ల నందయ్య విద్యార్థనలో వెనుకబడి చాలా కాలంగా అశ్రములో ఉంటున్నారు. ఆశ్రమానికి నందయ్య శాశ్వత విద్యార్థి అని తోటి విద్యార్థులు అప్పుడప్పుడు అట పట్టిస్తుంటారు. అందుకు నందయ్య మతిమరుపుకి చింతిస్తాడు తప్ప వివాదం చేసుకోడు. ఒక రోజు గురువుగారు పని వుండి ఊరెళ్లాడు. అప్పుడు సరదా కొద్ది విద్యార్థులు నందయ్యని ఎక్కువగా వేళాకోళం గావించి మనస్థాపం కలగజేసారు. నందయ్య సహించలేక ఆత్మహత్యకు పూనుకున్నాడు..
నందస్వామి వనమూలికల వైద్యం చేస్తారు. ఈ మధ్య మంద బుద్ధి నివారణార్థం గరళం పాలుతో వాగ్దేవి లేహ్యం తయారు చేసారు. ఇంకా ఏ రోగికివ్వలేదని విద్యార్థులకి తెలుసు. గరళం ప్రాణం తీస్తుంది. గనుక వాగ్దేవి లేహ్యం తిని చనిపోవాలనుకున్న నందయ్య ఎవరూ చూడకుండా కుటీరం లోంచి లేహ్యం సీసా బైటికి తెచ్చాడు. గబగబా సీసాడు లేహ్యం మింగేసాడు. చచ్చే ముందు దైవప్రార్ధన మొదలుపెట్టాడు. చాలాసేపు చేసాడు. అతడనుకున్నట్టు తను మరణించలేదు సరికదా పై పెచ్చు శరీరం బాగా వేడెక్కిపోయి మంట పెడుతుంటే సందయ్య భరించలేక పరుగున వెళ్లి బావిలో దూకేశాడు. విద్యార్థులు గాంచి భయపడిపోతూ వచ్చి నూతిలోపలికి తొంగి చూసి విస్తుపోయారు. నందయ్య క్షేమంగా ఉన్నాడు.
బావిలో నీరు నడుంవరకుంది. అందువల్ల నందయ్య మునిగిపోలేదు. సురక్షితంగా ఉన్నాడు. ప్రాణాపాయం లేనందుకు విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత తమ అవహేళనకి నూతిలో దూకేసాడానుకున్న శిష్యునికి నందయ్య లేహ్యం మింగినట్టు తెలీదు. నందయ్య చెప్పబోయాడు. క్షణాల్లో నందయ్య నిర్వాకం గ్రహించి నవ్వుకున్నాడు . ఈలోగా విద్యార్థులు పెద్ద మోకు తెచ్చి బావిలో వదలపోతే స్వామి వారించి " వాగ్దేవి లేహ్యంలో గరళం పాలు తక్కువ, ఇతర దినుసులు వనమూలికలు చూర్ణం పాలు ఎక్కువగా ఉంటుంది. మోతాదు మించి సేవించడం వల్ల మరణం రాదు కానీ శరీరం బాగా వేడెక్కిపోతుంది. అది భరించలేక సందయ్య బావిలో దూకడం మంచిదైంది. బావినీరు విరుగుడుగా వేడి తగ్గి శరీరం చల్లబడింది. అందుకు తగ్గట్టు తక్కువనీరు కాపాడింది" అంటే నందయ్య అవునన్నాడు మరల స్వామి అందుబాటులో లేహ్యం ఉంది కనుక నందయ్య ఇతర విషయాలపై దృష్టి పెట్టలేదు, బతికాడు. నూతిలో నిండుగా ఈతరాని నందయ్య మునిగి చనిపోయేవాడు. లేహ్యం. నూతినీరు కాపాడాయి. ఈ ఉపద్రవానికి మూల కారణం మితిమీరిన మీ హాసపరిహాసాలు, వెక్కిరింతలు, వేళాకోళాలు వాటి ప్రభావం ప్రత్యక్షంగా చూసారు. ఏది కూడా శృతి మించరాదు అనేసరికి శిష్యులు తమ అల్లరి తప్పు అని గ్రహించి నందయ్యకి క్షమాపణ చెప్పుకున్నారు. తర్వాత నందయ్యని తాడుతో పైకి లాగేరు . ఇక ఎప్పుడూ జీవితంలో ఆత్మహత్యకి ప్రయత్నించనని నందయ్య ప్రమాణం చేసాడు. అనంతరం మరల నందస్వామి తయారుచేసిన వాగ్దేవి లేహ్యాన్ని మోతాదుగా సేవించడమే కాదు శ్రద్ధగా చదివి మననం చేసుకుని నందయ్య కృతార్థుడయ్యాడు.
బాలలూ పరిహాసం ప్రమోదమే కాదు ప్రమాదం కూడా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి