రాకాసి గుర్రాలు! అచ్యుతుని రాజ్యశ్రీ

 మనజానపద కథల్లో లాగా గ్రీకు పురాణం లో వింత పశువులు ఉన్నాయి.అవి రాకాసి గుర్రాలు.డయోమీడిస్ అనే రాజు బిస్టోనియాని పాలించాడు.అతని దగ్గర ఉన్న గుర్రాలకు ఆహారం ఏంటో తెలుసా?తను జయించిన వారిని ఆగుర్రాలకు మేతగా వేసేవాడు.హెర్క్య్ లిస్ ఆగుర్రాలను తన బలంతో స్వాధీనం లోకి తెచ్చుకుంటాడు. వాటికి కాపలాగా ఆబ్డెరోస్ అనే అతన్ని ఉంచుతాడు.ఆపై రాజుని బిస్టోన్లు అనే తెగవారిని చంపుతాడు.హెర్క్యులస్ తిరిగి వచ్చేసరికి రాకాసి గుర్రాలు కాపలాగా ఉన్న ఆబ్డెరోస్ ని చంపుతాయి.కోపంతో హెర్క్యులిస్ డయొమిడీస్ రాజుని గుర్రాలకి మేతగా వేశాడు.ఇలాంటి కథల్ని ఆనాటి ఆంగ్ల కవులు వాడేవారు తమకవితల్లో🌹
కామెంట్‌లు