బాబూ.... పాపా... రండీ... !; -కోరాడ నరసింహా రావు.
బాబూ...పాపా....రండీ...రండి!
ఉదయిస్తున్న సూర్యుడ్ని చూడండి !
    చేతులు జోడించి భక్తితో... దండం పెట్టండి !

అది కేవలమొక అగ్ని గోళమని అంటారు కానీ...., 
   మనకు ప్రత్యక్ష  దైవమీ దిన కరుడే.. ! 

ఈసూర్యుని,ఉదయాస్తమయములే... మన రాత్రీ - పగలుకు మూలం !

సూర్యుని వలన నే... సముద్ర జలములు ఆవిరి యై... 
  మేఘములుగ మారి..., 
   మనకు వర్షములు కురియు చున్నవి.. !

సమృద్ధిగా పంటలు పండాలన్నా..., 
  మనం ఆరోగ్యంగా ఉండాలన్నా... 
  ఆ సూర్యదేవుని కరుణ వలననే.... !

నింగీ, నేలా... నీరూ, గాలీ... భగ - మండే అగ్నిగోళమీ సూర్యదేవుడూ...., 
    ఇవన్నీ మనకు పూజనీయ దైవాలే !!

మన పుట్టుకకు, సుఖ, సంతోషాది సర్వము నకూ... 
  మూలమైన ఈ శక్తులను... 
 ఆరాధించుటే, మన భారతీయ ఔన్నత్యము !

బాబూ... పాపా... ఆ బాల భానుని దివ్య మూర్తికి... 
  భక్తి, శ్రద్దలతో మ్రొక్కండి.. !!
      *******

కామెంట్‌లు