గ్రహం, అసహనం సరైన అవగాహనకు విరోధులు’’ అన్నారు మహాత్మా గాంధీ. సమస్యలను అధిగమించడానికి సంకల్పబలం ఎంత అవసరమో సహనం కూడా అంతే అవసరం. దురదృష్తవశాత్తు మానవాళికి డబ్బు, దాని ద్వారా వచ్చే సౌఖ్యాలు ఎక్కువవుతున్న కొద్దీ సహనం తగ్గిపోతోంది తద్వారా సాటి మానవులతో సత్సంబంధాలు తగ్గిపోతున్నాయి మరియు పలు రకాల మానసిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
‘సహనం’ అంటే భరించడం కాదు, ఆమోదించడం అని అర్ధం చెబుతారు. అసహనం మానవుల్లో మాత్రమే కనిపించే లక్షణం. చెట్లకూ, పుట్టలకూ, జంతువులకూ, పక్షులకూ ఈ లక్షణం ఉండదు. కానీ ప్రకృతిలో ప్రతిదీ నిర్ణీత సమయంలో జరుగుతుంది. ప్రతి పని నిర్దిష్టమైన సమయం తీసుకుంటుంది. కాబట్టి కర్తవ్యాన్ని నిర్వర్తించాలి తప్ప జరగబోయేదాని గురించి అదే పనిగా ఆలోచించడం, తక్షణం జరగాలని ఆత్రుత పడడం వల్ల ప్రయోజనం లేదు. దానికే ఓర్పు, సహనం కావాలి. ఆధ్యాత్మిక అంశాలలో మరింత సహనం అవసరం లేకపోతే ప్రగతి సాధించదం కష్తం.
నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకుంటూ, నిరంతరం అంకిత భావంతో చేసే కృషి, అవాంతరాలెదురైన సందర్భాల్లో సైతం పక్కకు తప్పుకోకుండా ఆత్మస్థైర్యంతో పట్టుదలతో ఎదుర్కోవడం, పొగడ్తలకు, విమర్శలకు ప్రాధాన్యమివ్వకుండా చేసే యజ్ఞం. కార్యక్షేత్రం ఏదైనా కోరుకున్న ఫలితాలను సాధించాలంటే శిఖరాలను అధిరోహించాలంటే సహనం తప్పనిసరి. ప్రపంచ మనుగడే సహనంతో ముడివడి ఉంది.
మట్టి భారాన్ని మోసినప్పుడే విత్తు మొక్కవుతుంది. మట్టిగడ్డను చీల్చుకుని విత్తనం మొలకెత్తుతుంది. చివరకు మానుగా ఎదిగి చుట్టూతా విస్తరించి సమస్త ప్రాణికోటికి ప్రాణవాయువు అందిస్తుంది. ఈ ప్రక్రియలో విత్తనానికి తగిన కాలవ్యవధి ఉన్నందునే చెట్టుగా రూపాంతరం చెందుతుంది. సహనం వహించిన గొంగళిపురుగు రంగురంగుల సీతాకోకచిలుకగా మారి కనువిందు చేస్తుంది. అంటే ఆశించిన ఫలితాలు సాధించుకోవాలంటే మనిషి తన ప్రయత్నంతో పాటు ఓర్పూ, సహనం సహజసిద్ధంగా వొంట బట్టించుకోవాలి.
సి.హెచ్.సాయిప్రతాప్
బాచిలర్స్ ఇన్ జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్స్( ఉస్మానియా)
ఫ్లాట్ నెంబర్ : 405 ,శ్రీ బాలాజీ డిలైట్స్
రాహుల్ కోలనీ, ఎ ఎస్ రావు నగర్
సాయి సుధీర్ కాలేజీ వద్ద
హైదరాబాద్ 500 062
MOBILE no : 98808 51898

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి