పూర్వపు చదువులు- (బాల గేయం);- ఎడ్ల లక్ష్మి
కట్టె పలుక పట్టుకుని
బల్పం రాయి తీసుకుని
నాడు బడికి వెళ్లి పిల్లలు
అక్షరాలను దిద్దినారు !!

తట్ట నిండా గుల్కరాళ్లు
నేల మీద అక్షరాలు 
వాటి పైన గులకరాళ్లు
నేర్చినారు అక్షరాలు !!

ఇసుక తెచ్చి పోసినారు
అందులోన రాసినారు
ఆటపాటలతో పిల్లలకు
అచట అక్షరాల శిక్షణ !!

గులకరాళ్లు కుప్ప పోసి
ఒకటి రెండు తీసుకుంటూ
ఐదు రాళ్ల కుప్ప పెట్టి
ఒంట్లనేమో నేర్చినారు !!

అలా నాడు చదివినారు
నేడు వారిని చూడగా
చక్కగా శాస్త్రజ్ఞులై
 బంగారు భవిష్యత్తును చూపినారు !!


కామెంట్‌లు