మామిడి మొక్క;- ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
మామిడి మొక్క తెచ్చాము
పెరటిలోన నాటాము
నీళ్లు పోసి పెంచాము
కొమ్మలు రెమ్మలు వేసింది!!

చక్కగా మొక్క ఎదిగింది
చల్లటి నీడను ఇచ్చింది
చిన్నగా పూత పూసింది
కొమ్మల నిండా కాసింది !!

కాయలన్నీ మక్కాయి
అమ్మ పండ్లు కోసింది
మా అందరికీ ఇచ్చింది
బొజ్జ నిండా తిన్నాము !!

పిల్లలు పెద్దలు విన్నారా
తలా ఒక్క మొక్క నాటండి
చల్లటి గాలిని వీస్తాయి
తియ్యని ఫలాలను ఇస్తాయి !!


కామెంట్‌లు