హైకూలు;- సుమ కైకాల
1. ఒక కవిత
    నిద్రరాని రాత్రుల
    జీవనసారo!...

2. ఒక కథనం
    భాష రాని కనుల 
    భావ ప్రపంచం!...

3. విరహజ్వాల 
    కవితాత్మక రూపం
    మేఘ సందేశం!...

4. రెండు బంధాలు 
    చేయి చేయి కలిపితే
    చెలిమి రాగం!...

5. ద్వేష కుంపటి
    మదిలో రాజేయకు
    మసవుతావు!...

కామెంట్‌లు